Samsung Galaxy F15: శాంసంగ్ ఇప్పుడు కొత్తగా శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15 జి స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఇతర సిరీస్ ఫోన్లతో పోలిస్తే ఎఫ్ సిరీస్ ఫోన్లు చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 4 జీబీ, 6 జీబీ, 8 జీబీ ర్యామ్ కలిగిన వేరియంట్లు ఉన్నాయి. ఈ ఫోన్ ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15 అనేది ఆండ్రాయిడ్ 14 ఆధారితమైన వన్ యూఐ 5 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇందులో 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ సూపర్ ఎమోల్డ్ ఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. నాలుగేళ్లవరకూ ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్స్, ఐదేళ్ల వరకూ సెక్యూరిటీ అప్‌డేట్స్ అందుతాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో గరిష్టంగా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఉండటంతో బ్యాకప్ సమయం చాలా ఎక్కువ. అంటే ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా రెండ్రోజులు పాటు పనిచేస్తుంది. గతంలో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15 4జీబీ, 6జీబీ ర్యామ్ ఉంటే ఇప్పుడు 8జీబీ ర్యామ్ అందుబాటులో వచ్చింది.
ఈ ఫోన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండి మూడు రంగుల్లో లభ్యమౌతోంది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా కెమేరా. ఈ ఫోన్‌లో 3 కెమేరా సెటప్ ఉంది. మెయిన్ కెమేరా 50 మెగాపిక్సెల్ కాగా 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉన్నాయి. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 13 మెగాపిక్సెల్ కెమేరా అందుబాటులో ఉంది. ఇక కనెక్టివిటీ విషయంలో 5జీ వైఫై, బ్లూటూత్ 5.3 వెర్షన్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బి సి పోర్ట్ ఉన్నాయి. ఇవి కాకుండా యాక్సెలెరోమీటర్, గైరో సెన్సార్, లైట్ సెన్సార్, వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15 మొదట్లో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. 4జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ ఫోన్ 12,999 రూపాయలు కాగా, 6జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ ధర 14,499 రూపాయలుగా ఉంది. ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ 15,999 రూపాయలుగా ఉంది. Samsung Galaxy F15 ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
Also read: Today Gold Price: పసిడి ధరలు పైపైకి.. ఈరోజు తులం బంగారం ఎంత అంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook