Samsung Galaxy S21 Fe 5G Price: సామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్స్‌కి మార్కెట్‌లో మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా సాధరణ బడ్జెట్‌లో లభించే ఈ బ్రాండ్ మొబైల్స్‌కి మార్కెట్‌లో ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే. అయితే మీరు కూడా అతి తక్కువ ధరకే శక్తివంతమై ఫీచర్స్ కలిగిన సాంసంగ్ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ఫ్లిఫ్‌కార్ట్ సాంసంగ్ స్మార్ట్ ఫోన్‌పై అందిస్తున్న ప్రత్యేక డీల్‌ను పరిచయం చేయబోతున్నాం. ఈ డీల్‌లో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్‌ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది.
ఫ్లిఫ్‌కార్ట్ గతంలో ఈ SAMSUNG Galaxy S21 FE 5G స్మార్ట్ ఫోన్ MRP ధర రూ.74,999తో విక్రయించింది. అయితే సాధరణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 43,000 ఫ్లాట్ తగ్గింపును అందిస్తోంది. దీంతో ఈ మొబైల్ రూ.31,999కే ఫ్లిఫ్‌కార్ట్‌లో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు ఇతర తగ్గింపు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ
సాంసంగ్ Galaxy S21 FE 5G స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉంది. మీరు ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో సాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగిస్తే 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా మీరు ఈ స్మార్ట్ ఫోన్‌ను ఏ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేసిన దాదాపు రూ.1,500 వరకు తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా మీరు ఫ్లిఫ్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ను వినియోగిస్తే 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను రూ. 30,000 కంటే తక్కువ ధరకే పొందవచ్చు.
Galaxy S21 FE 5G స్పెసిఫికేషన్‌లు:
6.4 అంగుళాల పూర్తి HD + డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్
అంతర్గత ఎక్సినోస్ ప్రాసెసర్
ట్రిపుల్ కెమెరా సెటప్
12MP+12MP+8MP కెమెరా సెటప్
32MP ఫ్రంట్ కెమెరా
4500mAh బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook