Samsung Galaxy M14 5G Price Down: వావ్‌ 42 శాతం డిస్కౌంట్.. అమెజాన్‌లో Galaxy M14 మొబైల్‌ను రూ.590కే పొందండి..

Get Samsung Galaxy M14 5G @590: అమెజాన్‌లో సాంసంగ్ సాంసంగ్ గెలాక్సీ ఎం14 5G స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 19, 2024, 03:10 PM IST
Samsung Galaxy M14 5G Price Down: వావ్‌ 42 శాతం డిస్కౌంట్.. అమెజాన్‌లో Galaxy M14 మొబైల్‌ను రూ.590కే పొందండి..

Get Samsung Galaxy M14 5G @590: ప్రముఖ దక్షిణ కొరియా మొబైల్‌ తయారీ కంపెనీ సాంసంగ్ భారత్‌లో ఊహించని యూజర్‌బేస్‌ను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని సాంసంగ్‌ కంపెనీ వరసగా 5G మొబైల్స్‌ను లాంచ్‌ చేస్తూ వస్తోంది. అంతేకాకుండా ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ చేసిన కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌ కూడా డెడ్‌ చీప్‌ ధరల్లో లభిస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో Galaxy M14 5G మోడల్‌ అతి తక్కు ధరలో లభిస్తోంది. ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను రూ.10 వేలలోపే పొందాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అమెజాన్‌ అందిస్తున్న ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా సాంసంగ్‌ గెలాక్సీ M14 5G మొబైల్‌ డెడ్‌ చీప్‌ ధరకే లభిస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 

ప్రస్తుతం మార్కెట్‌లో 6GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ MRP ధర రూ.18,990కు అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేక డీల్‌ భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు 42 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ కేవలం రూ. 10,990కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేయాలనుకునేవారు వన్‌కార్డ్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు సాంసంగ్‌ Axis Signature Credit Card లేదా సాంసంగ్‌ Axis Infinite Credit Card కార్డ్‌లను వినియోగించి పేమెంట్‌ చేస్తే దాదాపు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. 

దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను వినియోగించుకునేవారికి Galaxy M14 5G స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలోనే లభిస్తుంది. ఈ ఆఫర్‌ను వాడి కొనుగోలు చేయాలనుకునేవారు ముందుగా మీరు వినియోగిస్తున్న పాత మొబైల్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.10,400 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అన్ని పోను ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.590కే పొందవచ్చు. అలాగే ఈ మొబైల్‌పై అదనంగా ఇతర బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అవేంటో తెలుసుకోవడానికి అమెజాన్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

సాంసంగ్ గెలాక్సీ ఎం14 5G టాప్ 10 ఫీచర్స్:
90Hz రిఫ్రెష్ రేట్ తో మృదువైన దృశ్య అనుభవం కోసం 6.6-అంగుళాల FHD+ డిస్ప్లే
అద్భుతమైన ఫోటోలు, వీడియోలను తీయడానికి 50MP ప్రధాన కెమెరా.
విస్తృత దృశ్యాలను క్యాప్చర్ చేయడానికి 5MP అల్ట్రా-వైడ్ కెమెరా.
పోర్ట్రెయిట్ మోడ్‌లో అద్భుతమైన బొకె ఎఫెక్ట్‌లను సృష్టించడానికి 2MP డెప్త్ కెమెరా.
దగ్గరగా చూడడానికి 2MP మాక్రో కెమెరా
సెల్ఫీలను తీయడానికి 13MP సెల్ఫీ కెమెరా
రోజంతా ఉండే బ్యాటరీ లైఫ్ కోసం 5000mAh బ్యాటరీ
త్వరగా ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి 15W ఫాస్ట్ చార్జింగ్
శక్తివంతమైన పనితీరు కోసం Exynos 1330 ప్రాసెసర్
వేగవంతమైన డౌన్‌లోడ్‌లు, స్ట్రీమింగ్ కోసం 5G కనెక్టివిటీ

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News