Jio Mobile New Plans: జియో నుంచి 11 నెలల అద్భుతమైన ప్లాన్, ఇతర చౌక ప్లాన్స్ ఇవే

Jio Mobile New Plans: జియో యూజర్లకు గుడ్‌న్యూస్. ఎయిర్‌టెల్‌కు పోటీగా జియో కొత్త కొత్త ఆఫర్లు ప్రకటిస్తోంది. జియో ప్రకటించిన కొత్త ఆఫర్ నిజంగా అద్భుతంగా ఉంది. 11 నెలలు నిరాటంకంగా పనిచేస్తుందిది. ఈ ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 24, 2023, 03:53 PM IST
Jio Mobile New Plans: జియో నుంచి 11 నెలల అద్భుతమైన ప్లాన్, ఇతర చౌక ప్లాన్స్ ఇవే

రిలయన్స్ జియో వివిధ రకాల ఆఫర్లు, ప్లాన్స్‌తో యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పుడు మరోసారి సరికొత్త ప్రీ పెయిడ్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ ఏకంగా 11 నెలల వరకూ పనిచేయనుంది. ఆశ్చర్యంగా ఉందా..నిజమే. ఈ ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి.

రిలయన్స్ జియో కొత్తగా 11 నెలల వ్యాలిడిటీ ప్లాన్ ప్రకటించింది. వ్యాలిడిటీ ప్రకారం చూస్తే ఈ ప్లాన్ ధర చాలా తక్కువ. ఈ ప్లాన్ ధర 895 రూపాయలు మాత్రమే. జియో ఫోన్ యూజర్లకు ఈ ప్లాన్ వర్తిస్తుంది. ఈ ప్లాన్‌లో 895 రూపాయలకు 336 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. అంటే మొత్తం 11 నెలల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో 28 రోజుల చొప్పున 12 సైకిల్ ప్లాన్స్ ఉంటాయి. ఈ ప్లాన్‌లో 28 రోజులకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటుంది. మొత్తం 28 రోజులకు 50 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. జియో యాప్స్ యాక్సెస్ ఉంటుంది.

జియో ఫోన్ 222 రీఛార్జ్ ప్లాన్

జియో ఫోన్ 222 ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి.

జియో ఫోన్ 186 రీఛార్జ్ ప్లాన్

జియో ఫోన్ 186 ప్లాన్‌లో కూడా 28 రోజుల డేటా ఉంటుంది. ఇందులో రోజుకు 1 జీబి డేటా ఉంటుంది. దాంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి.

Also read: Lic investments in Adani: అదానీ గ్రూప్‌లో ఎల్ఐసీ పెట్టుబడి ప్రతికూల ప్రభావం చూపిస్తోందా, అసలేం జరుగుతోంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News