Redmi Note 13 Pro 5G: Redmi Note 13 సిరీస్‌ మొబైల్స్‌ల ధరేంతో తెలుసా? లీక్‌ అయిన ధర, ఫీచర్స్‌ వివరాలు!

Redmi Note 13 Pro 5G Price Leak: ప్రస్తుతం సోషల్ మీడియాలో అతి త్వరలోనే విడుదల కాబోయే Redmi Note 13 5G సిరీస్‌కి సంబంధించిన ధర వైరల్‌ అవుతోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్స్‌ ఫీచర్స్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్స్‌కి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2024, 09:14 PM IST
Redmi Note 13 Pro 5G: Redmi Note 13 సిరీస్‌ మొబైల్స్‌ల ధరేంతో తెలుసా? లీక్‌ అయిన ధర, ఫీచర్స్‌ వివరాలు!

 

Redmi Note 13 Pro 5G Price Leak: కొత్త సంవత్సరం సందర్భంగా ప్రముఖ చైనీస్‌ బ్రాండ్‌ Xiaomi తమ కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ Redmi Note 13 5G విడుదల చేయబోతోంది. ఇప్పటికే ఈ సిరీస్‌కు సంబంధించిన అధికారిక సమాచారాన్ని కంపెనీ విడుదల చేసిన సంగతి తెలిసిందే..అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ సిరీస్‌లు భారత్‌లో జనవరి 4న విడుదల చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మొబైల్స్‌ను కంపెనీ Redmi Note 13 5G, Redmi Note Pro 5G, Redmi Note 13 Pro+ 5G పేర్లతో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్స్‌కి సంబంధించిన ధర లీకై..సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  

ఈ మొబైల్స్‌కి సంబంధించిన ధర వివరాలను టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. రాబోయే నోట్‌ 13 సిరీస్‌లు  ప్రిజం గోల్డ్, ఆర్కిటిక్ వైట్, స్టెల్త్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. లీక్‌ అయిన వివరాల ప్రకారం..8 GB RAM + 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ధర రూ.28,999 ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక 12 GB RAM + 256 GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.32,999 ఉంటుందని సమాచారం. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్‌కి సంబంధించిన ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

ఇక టాప్‌ ఎండ్‌ వేరియంట్ విషయానికొస్తే..Redmi Note 13 Pro + 5G స్మార్ట్‌ ఫోన్‌ ఆర్కిటిక్ వైట్, కోరల్ పర్పుల్, మిడ్‌నైట్ కలర్ ఆప్షన్‌లలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. టిప్‌స్టర్ తెలిపిన వివరాల ప్రకారం..8 GB RAM + 256 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ కలిగిన స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ. 33,999లుగా ఉండగా..12 GB RAM + 512 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన ఈ మొబైల్‌ రూ. 37,999తో అందుబాటులోకి రానుంది. 

ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లు:
టిప్‌స్టర్ సుధాన్షు ఆంబోర్ లీక్ చేసిన వివరాల ప్రకారం..రాబోయే సిరీస్ స్పెసిఫికేషన్స్‌ 2400x1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో రాబోతోంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ Mali-G57 MC2తో డైమెన్షన్ 6080 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. Redmi Note 13 5G స్మార్ట్‌ఫోన్ 8GB LPDDR4x RAM, 256GB వరకు UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. అంతేకాకుండా చాలా రకాల కొత్త ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. 

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News