Redmi 13C Price Cut: అమెజాన్‌లో మొబైల్‌ పౌచ్‌ ధరకే 128GB స్టోరేజ్‌ Redmi 13Cను పొందండి.. సడెన్‌గా రూ.8,350 తగ్గింపు..

Redmi 13C Price Cut: అతి తక్కువ ధరలోనే 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ మొబైల్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం అమెజాన్‌ Redmi 13C మొబైల్స్‌పై ప్రత్యేక డీల్స్‌ను అందిస్తోంది. అంతేకాకుండా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 13, 2024, 10:36 AM IST
Redmi 13C Price Cut: అమెజాన్‌లో మొబైల్‌ పౌచ్‌ ధరకే 128GB స్టోరేజ్‌ Redmi 13Cను పొందండి.. సడెన్‌గా రూ.8,350 తగ్గింపు..

Redmi 13C Price Cut: రెడ్‌మీ బ్రాండ్‌లో మంచి మొబైల్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ ప్రత్యేక డీల్‌ను అందిస్తోంది. ఈ డీల్‌లో భాగంగా రెడ్‌మీకి సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌ అతి తక్కువ ధరలో లభిస్తున్నాయి. దీంతో పాటు కొన్ని మొబైల్‌పై అదనంగా 30 శాతం వరకు ప్లాట్‌ తగ్గింపును కూడా అందిస్తోంది. గతంలో రెడ్‌మీ లాంచ్‌ చేసిన Redmi 13C స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేక డీల్‌ అందుబాటలో ఉంది. ఇందులో భాగంగా ఈ మొబైల్‌ను కొనుగోలు చేస్తే 37 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా దీనిపై అదనంగా ఇతర ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రస్తుతం ఈ Redmi 13C స్మార్ట్‌ఫోన్‌ మూడు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో మొదటిది 4 ర్యామ్‌, 128 ఇంటర్నల్‌ స్టోరేజ్‌ అయితే, రెండవది 6 ర్యామ్‌, 128 ఇంటర్నల్‌ స్టోరేజ్‌, మూడవది 8 ర్యామ్‌, 256 ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో లభిస్తున్నాయి. అమెజాన్‌లో 6+128 ఆప్షన్‌ కలిగిన MRP ధర రూ.13,999తో అందుబాటులో ఉండగా ప్రత్యేక డీల్‌లో భాగంగా 37 శాతం తగ్గింపుతో కేవలం రూ.8,799కే పొందవచ్చు. దీంతో పాటు ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. దీని కోసం అధికారిక అమెజాన్‌ వెబ్‌సైట్‌ను సంద్శించాల్సి ఉంటుంది.

అలాగే దీనిపై ఎక్చేంజ్ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు రూ.8,350 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ఆఫర్‌ అనేది మీరు ఎక్చేంజ్‌ చేసే పాత స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌తో పాటు కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. కండీషన్‌ బాగుంటేనే అమెజాన్‌ అందిస్తున్న బోనస్‌ లభిస్తుంది. లేకపోతే అందనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ కేవలం రూ.449కే పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం అమెజాన్‌ అధికారి సైట్‌ను సందర్శించండి. 

  
రెడ్‌మీ 13సి ఫీచర్స్‌:
1. డిస్‌ప్లే:

6.53-అంగుళాల HD+ డిస్‌ప్లే
720 x 1600 పిక్సెల్‌ రిజల్యూషన్
20:9 యాస్పెక్ట్ రేషియో

2. ప్రాసెసర్:
MediaTek Helio G85 SoC ప్రాసెసర్
2.0GHz ఆక్టా-కోర్ CPU
Mali-G52 MC2 GPU

3. RAM & స్టోరేజ్:
4GB LPDDR4x RAM
64GB లేదా 128GB eMMC 5.1 స్టోరేజ్
మైక్రో SD కార్డ్ ద్వారా విస్తరించదగిన స్టోరేజ్

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

4. కెమెరాలు:
50MP ప్రధాన కెమెరా
2MP డెప్త్ సెన్సార్
2MP మాక్రో కెమెరా
5MP సెల్ఫీ కెమెరా

5. బ్యాటరీ:
5000mAh పెద్ద లిథియం-పాలిమర్ బ్యాటరీ
18W ఫాస్ట్ చార్జింగ్

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News