Redmi 13 5G Price: అమెజాన్‌లో రూ. 12 వేలకే కొత్త Redmi 13 5G మొబైల్‌.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!

Redmi 13 5G Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ షావోమీ (Xiaomi) నుంచి మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌ లాంచ్‌ అయ్యింది. ఈ Redmi 13 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మొదటి సేల్‌ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 12, 2024, 02:45 PM IST
Redmi 13 5G Price: అమెజాన్‌లో రూ. 12 వేలకే కొత్త Redmi 13 5G మొబైల్‌.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!

Redmi 13 5G Price: షావోమీ (Xiaomi) సబ్-బ్రాండ్ Redmi మార్కెట్‌లోకి ఇటీవలే లాంచ్ చేసిన బడ్జెట్ ఫ్రెండ్లీ Redmi 13 5G స్మార్ట్‌ఫోన్‌కి మార్కెట్‌లో మంచి గుర్తింపు లభించింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మొదటి సేల్‌ జూలై 12 నుంచి ప్రారంభమైంది. రెడ్‌మీ కంపెనీ దీనిని ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ మొబైల్‌ Redmi 12 5G స్మార్ట్‌ఫోన్‌కి అప్‌గ్రేడ్ వేరియంట్‌లా విడుదల చేసింది. దీనిని కంపెనీ గత సంవత్సరంలోని ఆగస్టులో లాంచ్‌ చేయగా మంచి గుర్తింపు లభించింది. దీంతో కంపెనీ ఈ Redmi 13 5G స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.

Redmi 13 5G ధర, డిస్కౌంట్ పూర్తి వివరాలు:
ఈ Redmi 13 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మొదటి సేల్‌ ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైంది. అయితే దీనిని కంపెనీ రెండు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో లాంచ్‌ చేసింది. ఇందులోని మొదటి స్టోరేజ్‌ వేరియంట్‌ 6GB ర్యామ్‌, 128GB స్టోరేజ్ ఆప్షన్‌తో రూ. 13,999లతో అందుబాటులోకి వచ్చింది. ఇక రెండవ వేరియంట్‌ 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ధర రూ.15,499లతో విడుదల చేసింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. 

ఈ Redmi 13 5G మొబైల్‌ మూడు (ఓషన్ బ్లూ, పెరల్ పింక్, మిడ్నైట్ బ్లాక్) కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్‌, బ్యాంక్‌ ఆఫర్స్‌ అన్ని పోనే రూ. 12,999కే పొందవచ్చు. దీంతో పాటు అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇతర ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అవేంటో తెలుసుకోవడానికి అమెజాన్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. ఇక దీని ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఈ Redmi 13 5G స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ బ్యాక్ సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు 6.79-అంగుళాల పూర్తి-HD+ డిస్ల్పే సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇవే కాకుండా ఇందులో ఇతర ఫీచర్స్‌ కూడా ఉన్నాయి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
6.79-అంగుళాల పూర్తి-HD+ IPS LCD డిస్‌ప్లే
1,080x2,400 పిక్సెల్స్‌
Qualcomm 4nm ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 AE SoC ప్రాసెసర్‌
5,030mAh బ్యాటరీ
33W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌
128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌
108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
3x ఇన్-సెన్సర్ జూమ్‌
2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా
13-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News