Realme GT 7 Pro: చూడగానే వావ్‌ అనిపించే డిజైన్‌తో కొత్త Realme GT 7 Pro వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఇవే!

Realme GT 7 Pro New Model 2025: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ రియల్‌మీ అతి త్వరలోనే Realme GT 5 Pro మొబైల్‌ను లాంచ్‌ చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 29, 2024, 02:48 PM IST
Realme GT 7 Pro: చూడగానే వావ్‌ అనిపించే డిజైన్‌తో కొత్త Realme GT 7 Pro వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఇవే!

 

Realme GT 7 Pro New Model 2025: ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ రియల్‌మీ (Realme) మరో ముందడుగు వేసింది. అత్యంత శక్తివంతమైన GT సిరీస్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్‌తో లాంచ్‌ చేయనుంది. అయితే ఇటీవలే కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ పేరును కూడా వెల్లడించింది. ఇది Realme GT 7 ప్రో పేరుతో అందుబాటులోకి రాబోతోంది. ఇది గతంలో లాంచ్‌ చేసిన Realme GT 6T స్మార్ట్‌ఫోన్‌కు ఈ మొబైల్‌ ఆప్డేట్‌ వేరియంట్‌లో అందుబాటులోకి రానుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్‌ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

గతంలో లాంచ్‌ చేసిన స్మార్ట్‌ఫోన్‌ను దృష్టిలో పెట్టుకుని తమ కస్టమర్స్‌ కోసం ఈ కొత్త వేరియంట్‌ను మార్కెట్‌లోకి తీసుకు వస్తున్నట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్  చేజ్ జు మైక్రోబ్లాగింగ్ తెలిపారు. ఈ  Realme GT 7 ప్రో అద్భుతమైన ఫీచర్సతో వస్తోందని ఇది వివిధ బ్రాండ్‌లకు సంబంధించిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్‌తో పోటీ పడే ఛాన్స్‌ ఉన్నట్లు ఆయన అన్నారు. అయితే ఈ కంపెనీకి సంబంధించిన అధికారిక సమాచారాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అతి త్వరలోనే వెల్లడించే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. 

రియల్‌ కంపెనీ గత డిసెంబర్‌ నెలలో చైనా మార్కెట్‌లో Realme GT 5 Pro స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసిన సంగతి అందిరికీ తెలిసిందే. అయితే ఇది ఎంతో శక్తివంతమైన Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్‌ తమ కస్టమర్స్‌ను అంతగా ఆకర్శించకపోయి మంచి పేరు మాత్రం పొందింది. దీంతో కంపెనీ మరో సారి జూన్‌ నెలలో రియల్‌మీ జిటి 6 లాంచ్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఆ తర్వాత ఈ రియల్‌మే జిటి 7 ప్రో విడుదల లాంచ్‌ చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

లాంచింగ్ తేది ఎప్పుడు?:
లీక్‌ అయిన వివరాల ప్రకారం, కంపెనీ  Realme GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఈ సంవత్సరం చివరి నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇది ఎంతో ప్రీమియం కలిగిన Qualcomm Snapdragon 8 Gen 4 ప్రాసెసర్‌తో లాంచ్‌ చేయబోతోంది. అంతేకాకుండా అద్భుతమైన డిజైన్‌తో ఈ మొబైల్‌ లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే కంపెనీ త్వరలోనే ఈ మొబైల్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో ప్రకటన చేసే ఛాన్స్‌ కూడా ఉంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News