Realme C67 Price: పిచ్చెక్కించే ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Realme C67 5G మొబైల్‌..ధర, ఫీచర్స్‌ పూర్తీ వివరాలు ఇవే!

Realme C67 Price: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి రీయల్ మీ అతి తొందరలోనే గుడ్ న్యూస్‌ తెలపబోతోంది. మార్కెట్‌లోకి వీలైనంత తొందలోనే Realme C67 5G స్మార్ట్‌ ఫోన్‌ని విడుదల చేయబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 1, 2023, 11:55 AM IST
Realme C67 Price: పిచ్చెక్కించే ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Realme C67 5G మొబైల్‌..ధర, ఫీచర్స్‌ పూర్తీ వివరాలు ఇవే!

 

Realme C67 Price: ప్రస్తుతం చాలా స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లతో కలిగినవి అందుబాటులో ఉన్నాయి. యువత కూడా ఇలాంటి స్మార్ట్ ఫోన్లనే కొనుగోలు చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా అధునాతన ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్స్ ని మిడిల్ రేంజ్ బడ్జెట్లో విక్రయిస్తున్నాయి. ముఖ్యంగా రియల్ మీ ఇటీవల విడుదల చేసిన మిడిల్ రేంజ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు మంచి గుర్తింపు ఉంది. అయితే రియల్ మీ బ్రాండ్ ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ ధరలోనే శక్తివంతమైన ఫీచర్లను కలిగిన మరో స్మార్ట్ ఫోన్లు విడుదల చేయబోతోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఏంటో? అందులో రాబోతున్న ఫీచర్స్ ఏంటో? మనం ఇప్పుడు తెలుసుకుందాం.

రియల్ మీ అతి త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయబోయే స్మార్ట్ ఫోన్ Realme C67 5G పేరుతో రాబోతోంది. ఈ మొబైల్ శక్తివంతమైన ఫీచర్స్ తో పాటు అతి తక్కువ ధరలోనే లభించనుంది. అతి తక్కువ ధరలోనే మంచి ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ కలిగిన స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ  Realme C67 5G మొబైల్‌ మంచి ఆప్షన్‌గా మారనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌ డిజైన్‌ విషయానికొస్తే ఇటీవలే రియల్ బ్రాండ్‌ విడుదల చేసిన సీ సిరీస్‌ మొబైల్‌ను పోలి ఉంటుందని తెలుస్తోంది. అయితే విడుదలకు ముందే ఈ Realme C67 5G స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించి ఫీచర్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

ఈ Realme C67 స్మార్ట్‌ ఫోన్‌ను రియల్‌ మీ బ్రాండ్‌ వచ్చే నెలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ధర విషయానికొస్తే రూ.15,000లోపే అందుబాటులో ఉంచబోతున్నట్లు పలువురు టిప్‌స్టర్స్‌ తెలుపుతున్నారు. ముందు ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కంపెనీ రెండు వేరియంట్స్‌తో పాటు మొత్తం మూడు కలర్స్‌లో లాంచ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ Realme C67 5G మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. వీలైనంత తొందలోనే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించి వివరాలను వెల్లడించబోతున్నట్లు తెలుస్తోంది.

Realme C67 5G స్పెక్స్, ఫీచర్స్:
ఈ Realme C67 5G మొబైల్‌ ఫోన్‌ 4GB, 6GBతో పాటు 8GB ర్యామ్‌ వేరియంట్స్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు వేరియంట్స్‌  128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో అందుబాటులో ఉండబోతున్నాయి. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన రంగుల విషయానికొస్తే..కంపెనీ ఆకుపచ్చ రంగుతో పాటు ఊదా రంగులో విడుదల చేయబోతోంది. ఈ  మొబైల్‌ ఫోన్‌ Snapdragon 8 Gen 3 చిప్‌సెట్‌ రన్‌ కాబోతోంది. అంతేకాకుండా 50MP బ్యాక్‌ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అయితే రియల్‌ మీ కంపెనీ  డిసెంబర్ 7న చైనాలో GT 5 ప్రో ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అతి త్వరలోనే భారత్‌లో కూడా విడుదల కాబోతోంది. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News