Realme 11X 5G Vs Realme Narzo 60X 5G: రియల్‌మీలో ఈ మొబైల్స్‌ కొనేవారు ఇవి తప్పకుండా తెలుసుకోండి!

Realme 11X 5G Vs Realme Narzo 60X 5G Compare In Telugu: రియల్‌మీ 11X 5G, రియల్‌మీ నార్జో 60X 5G స్మార్ట్‌ఫోన్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. అయితే ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది బెస్టో, ఏ మొబైల్‌ అతి తక్కువ ధరకు లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2024, 05:16 PM IST
Realme 11X 5G Vs Realme Narzo 60X 5G: రియల్‌మీలో ఈ మొబైల్స్‌ కొనేవారు ఇవి తప్పకుండా తెలుసుకోండి!

Realme 11X 5G Vs Realme Narzo 60X 5G Compare In Telugu: రియల్‌మీ 11X 5Gతో పాటు రియల్‌మీ నార్జో 60X 5G ఫోన్‌లు రెండూ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో 5G కనెక్టీవిటీతో లభిస్తున్నాయి. ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో క్రమంగా వీటి విక్రయాలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది కొనుగోలు చేయాలో అని చాలా మంది తికమక పడుతున్నారు. ఎందు కంటే ఈ రెండు దగ్గర దగ్గర సమానమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటాయి. అంతేకాకుండా సమానమైన ధరను కూడా కలిగి ఉంటాయి. కానీ స్పెషిఫికేషన్స్‌ పరంగా అక్కడక్కడ కాస్త తేడాలు కూడా కూడా ఉన్నాయి. అయితే ఈ రెండు మొబైల్స్‌ మధ్య తేడాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ రియల్‌మీ 11X 5G, రియల్‌మీ నార్జో 60X 5G స్మార్ట్‌ఫోన్స్‌ ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే..రియల్‌మీ 11X 5G మొబైల్‌ 6.6 అంగుళాల 90Hz IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 695 5G ప్రాసెసర్‌పై పని చేస్తుంది. దీంతో పాటు ఈ మొబైల్‌ బ్యాక్‌ సెటప్‌లో 13MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 2MP మార్క్‌ లెన్స్ కెమెరాను కలిగి ఉంటాయి. ఇక రియల్‌మీ నార్జో 60X 5G మొబైల్‌ విషయానికొస్తే, 6.5 అంగుళాల 120Hz IPS LCD డిస్‌ప్లేతో లభిస్తోంది. ఈ డిస్ల్పే ఇంతక ముందు ఉన్న స్మార్ట్‌ఫోన్‌ కంటే కాస్త పెద్దదిగా చెప్పొచ్చు. ఇక ఈ మొబైల్‌ మీడియాటెక్ 700 5G ప్రాసెసర్‌పై రన్‌ అవుతుంది. 

అలాగే ఈ రియల్‌మీ నార్జో 60X 5G స్మార్ట్‌ఫోన్‌ కూడా ట్రిపుల్‌ కెమెరా సెటప్‌లో మార్కెట్‌లో లభిస్తోంది. మొబైల్ బ్యాక్‌ సెట్‌లో 48MP ప్రధాన కెమెరా, 8MP వైడ్ యాంగిల్ లెన్స్, 2MP లెన్స్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇక ఈ మొబైల్స్‌కి సంబంధించిన బ్యాటరీల వివరాల్లోకి వెళితే రియల్‌మీ 11X 5G స్మార్ట్‌ఫోన్‌ 5000mAh బ్యాటరీతో 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో లభిస్తోంది. అంతేకాకుండా ఇది Android 11 (realme UI 2.0)పై పని చేస్తుంది. ఇక రియల్‌మీ నార్జో 60X 5G మొబైల్‌ వివరాల్లోకి వెళితే 6000mAh బ్యాటరీతో 33W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు Android 11 (realme UI 2.0)పై రన్‌ అవుతుంది.   

ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..

ఏది బెస్ట్‌ అంటే:
ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో మంచి డిస్ల్పేను కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే రియల్‌మీ 11X 5G గొప్ప ఎంపికగా భావించవచ్చు. అలాగే శక్తివంతమైన కెమెరాను కొనుగోలు చేయాలనుకునేవారికి,  బ్యాటరీ లైఫ్ కావాలంటే రియల్‌మీ నార్జో 60X 5G బెస్ట్‌ ఆప్షన్‌. ధర పరంగా రియల్‌మీ 11X 5G స్మార్ట్‌ఫోన్‌ చాలా బెస్ట్‌..

ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News