Realme 11x 5G Vs Realme 11 5G: ఈ రెండింటిలో ఏ మొబైల్‌ బెస్టో తెలుసా? ఫీచర్స్‌, ధర పరంగా ఇదే బెస్ట్!

Realme 11x 5G Vs Realme 11 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ రియల్‌ మీ ఇటీవలే మార్కెట్‌లో Realme 11x 5G, Realme 11 5G స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేసింది. అయితే ఇందులో ఏది కొనుగోలు చేయాలో తికమక పడుతున్నారు. ఇందులో ఏది బెస్త్‌ మొబైల్‌లో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2024, 02:47 PM IST
Realme 11x 5G Vs Realme 11 5G: ఈ రెండింటిలో ఏ మొబైల్‌ బెస్టో తెలుసా? ఫీచర్స్‌, ధర పరంగా ఇదే బెస్ట్!

 

Realme 11x 5G Vs Realme 11 5G: బడ్జెట్‌ ధరలో లభించే స్మార్ట్‌ఫోన్స్‌కి మార్కెట్‌లో ఫుల్‌ డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం యువత మిడిల్ రేంజ్‌ బడ్జెట్‌ల్‌లో లభించే మొబైల్స్‌నే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇటీవలే రియల్ మీ లాంచ్‌ చేసిన 11x, 11 మోడల్స్‌కి మార్కెట్‌లో మంచి గుర్తింపు లభించింది. దీంతో జనాలు వీటి రెండిటిలో ఏది కొనుగోలు చేయాలో తికమకపడుతున్నారు. అలాగే ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ ఫీచర్స్‌, ధర పరంగా సమానమైప్పటికీ..వీటి రెండింటిలో కొన్ని తేడాలు ఉన్నాయి. ఆ తేడాలేంటో..ఈ రెండింటిలో ఏ మొబైల్‌ బెస్టో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

రియల్‌మీ 11x 5G మధ్య 11 5G తేడాలు:
మొదట రియల్‌మీ 11x 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే..ఈ మొబైల్‌ 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ స్క్రీన్‌ 120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్‌ స్క్రోలింగ్, గేమింగ్ కోసం వాడేవారికి చాలా మృదువుగా ఉంటుంది. ఇక ప్రాసెసర్‌ విషయానికొస్తే..శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 870 5G ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక రియల్‌మీ 11 5G విషయానికొస్తే ఈ మొబైల్‌ 90Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.5 అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఈ మొబైల్‌ డిమాన్సీ 700 5G ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. 

ఇక ఈ రెండు మొబైల్స్‌ సంబంధించిన కెమెరా వివరాల్లోకి వెళితే..రియల్‌మీ 11x 5G స్మార్ట్‌ఫోన్‌ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. బ్యాక్‌ సెటప్‌లో 64MP ప్రధాన బ్యాక్‌ కెమెరా, 8MP అల్ట్రావైడ్ సెన్సార్, 2MP మాక్రో సెన్సార్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇక రియల్‌మీ 11 5G మొబైల్‌ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇది 50MP ప్రధాన కెమెరా, 2MP మాక్రో కెమెరా సెటప్‌తో లభిస్తోంది. కాబట్టి కెమెరా పరంగా చూస్తే 11x 5G స్మార్ట్‌ఫోన్‌ ముందుంటుంది. 

Also Read : Ibomma: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

రియల్‌మీ 11x 5G స్మార్ట్‌ ఫోన్ 5000mAh బ్యాటరీ, 50W ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్‌తో అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ మొబైల్‌ ధర రూ.14,000తో లభిస్తోంది. ఇక రియల్‌మీ 11 5G మొబైల్‌ విషయానికొస్తే, ఇది 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్‌తో లభిస్తోంది. దీని ధర మార్కెట్‌లో సుమారు రూ. 15,000గా ఉంది. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ పరంగా 11x 5G మోడల్‌ పనితీరు బాగుటుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ 5G కనెక్టివిటీలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా  ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్‌ అవుతాయి. 

Also Read : Ibomma: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News