Poco X6 Pro 5G Vs Honor X9b: ఈ రెండింటిలో ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ పరంగా బెస్ట్ మొబైల్‌ ఇదే..

Poco X6 Pro 5G Vs Honor X9b: ప్రస్తుతం చాలా మంది ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌ను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలైన Honor X9b మొబైల్‌ Poco X6 Pro 5Gకి గట్టి పోటీనిస్తోంది. అయితే ఈ రెండింటిలో ఏది బెస్టో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2024, 10:56 AM IST
Poco X6 Pro 5G Vs Honor X9b: ఈ రెండింటిలో ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ పరంగా బెస్ట్ మొబైల్‌ ఇదే..

Poco X6 Pro 5G Vs Honor X9b: గత నెలలో మార్కెట్‌లోకి అనేక టెక్‌ కంపెనీలకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌ లాంచ్‌ అయ్యాయి. ముఖ్యంగా ప్రముఖ టెక్‌ కంపెనీ హానర్‌ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ హానర్ ఎక్స్9బి(Honor X9b)ను విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన అన్‌బ్రేకబుల్ డిస్‌ప్లేతో మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది భారత్‌లో ధర రూ.25,999తో లభిస్తోంది. అంతేకాకుండా గతంలో లాంచ్‌ అయిన Poco X6 Pro 5Gతో గట్టి పోటీనిస్తోంది. అయితే చాలా మంది ఈ రెండు మొబైల్స్‌లో ఏది కొనుగోలు చేసే క్రమంలో తికమక పడుతున్నారు. అంతేకాకుండా వీటి రెండిటిలో ఏది బెస్ట్‌ మొబైలో తెలుసుకునేందుకు అసక్తి చూపుతున్నారు. వీటిల్లో ఏది బెస్టో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా Poco X6 Pro 5G ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే..ఈ మొబైల్‌  6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ స్క్రీన్‌  120 Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్‌తో అందబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా డాల్బీ విజన్, 12-బిట్ కలర్, HDR10+ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇక హానర్‌ విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రీమియం కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు సేమ్‌ రిజల్యూషన్‌తో అందుబాటులోకి వచ్చింది. పోకో మొబైల్‌ డిస్ల్పే ఎంతో బ్రైట్‌నెస్‌తో ఫ్లాట్‌ ఆకరంలో ఉంటుంది. 

ఫీచర్స్‌, మొబైల్ స్పీడ్‌:
Poco X6 Pro మొబైల్‌ MediaTek డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది గరిష్టంగా  12GB LPDDR5x ర్యామ్‌ సెటప్‌తో అందుబాటులోకి ఉంది. దీంతో పాటు 512GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఈ మొబైల్‌ 8GB వర్చువల్ ర్యామ్‌కు సపోర్ట్‌ చేస్తోంది. ఈ మొబైల్‌ను హానర్ ఎక్స్9బి(Honor X9b)తో పోల్చి చూస్తే ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ పరంగా ఎప్పుడు ముందుంటుంది. దీంతో పాటు ఈ పోకో సరికొత్త Android 14పై పని చేస్తుంది. ఈ హానర్‌ మొబైల్‌ విషయానికొస్తే Android 13పై రన్‌ అవుతుంది. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

బ్యాటరీ, కెమెరా:
ఇక ఈ రెండు మొబైల్స్‌కి సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళితే, Honor X9b 35W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5800mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఇక పోకో మొబైల్‌ హానన్‌ కంటే పెద్ద బ్యాటరీ సెటప్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు పోకో సెల్ఫీ కోసం  16 మెగాపిక్సెల్ కెమెరా ఫ్రాంట్‌ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. హానర్‌ కూడా సేమ్‌ మెగాపిక్సెల్ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. కెమెరా పరంగా హానర్‌ మొబైల్‌ ముందుంటుంది. అన్ని ఫీచర్స్‌ పరంగా పోకో మొబైల్‌ ముందుంటుంది. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News