Poco M6 Pro Price: POCO M6 Pro మొబైల్‌పై కళ్లు చెదిరే ఆఫర్స్‌.. కేవలం రూ.749కే పొందండి!

     Poco M6 Pro Price Cut: బిగ్‌ సెలింగ్‌ డేస్‌లో భాగంగా POCO M6 Pro 5G స్మార్ట్‌ఫోన్ డెడ్‌ చీప్‌ ధరలో లభిస్తోంది. ఈ మొబైల్‌ను మరింత తగ్గింపుతో కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన డిస్కౌంట్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 8, 2024, 12:53 PM IST
Poco M6 Pro Price: POCO M6 Pro మొబైల్‌పై కళ్లు చెదిరే ఆఫర్స్‌.. కేవలం రూ.749కే పొందండి!

Poco M6 Pro Price Cut: ప్రముఖ ఫ్లిఫ్‌కార్ట్ ‌బిగ్‌ సెలింగ్‌ డేస్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రిక్‌ వస్తువులపై బ్యాంక్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అలాగే కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై దాదాపు 40 శాతం వరకు డిస్కౌంట్‌ కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ సేల్‌లో భాగంగా పోకో మొబైల్స్‌ కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్‌లో POCO M6 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి భారీ బ్యాంక్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌ను ఎలా కొనుగోలు చేస్తే భారీ తగ్గింపును పొందవచ్చో.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం మార్కెట్‌లో POCO M6 Pro 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో లభిస్తోంది. అలాగే రెండు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఫ్లిఫ్‌కార్ట్‌లో 128 GB స్టోరేజ్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ ధర MRP రూ.16,999తో అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌ను ‌బిగ్‌ సెలింగ్‌ డేస్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి ఏకంగా 41 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.9,999కే పొందవచ్చు. దీంతో పాటు ఈ స్మార్ట్‌ ఫోన్‌ను మరింత తగ్గింపుతో పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ వినియోగించాల్సి ఉంటుంది.

ఈ POCO M6 Pro 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే, ఈ మొబైల్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌ UPIతో పేమెంట్‌ చేస్తే దాదాపు రూ.25 నుంచి రూ.50 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో పాటు ఫ్లిఫ్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే, 5 శాతం వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు అదనంగా తగ్గింపు పొందాలనుకునేవారు ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్‌ కార్డ్‌లను కూడా వినియోగించవచ్చు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఎక్చేంజ్‌ ఆఫర్‌:
ఫ్లిఫ్‌కార్ట్‌లో POCO M6 Pro 5G స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌‌ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ఆఫర్‌లో భాగంగా కొత్త మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు ముందుగా ఫ్లిఫ్‌కార్ట్‌కార్ట్‌కు పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.9,250 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ ఈ 128 GB స్టోరేజ్‌ రూ.749కే పొందవచ్చు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News