Poco M6 5G: 108MP కెమెరాతో కొత్త Poco M6 5G మొబైల్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌..

Poco M6 5G: ప్రీమియం ఫీచర్స్‌తో పాటు 108 మెగాపిక్సెల్ కెమెరా కలిగిన పోకో స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ లాంచ్‌ చేయబోతోంది. ఇది ప్రీమియం అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి రానుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 8, 2024, 11:48 AM IST
Poco M6 5G: 108MP కెమెరాతో కొత్త Poco M6 5G మొబైల్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌..

Poco M6 5G Price: ఎప్పటి నుంచో 108 మెగాపిక్సెల్ కెమెరాతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను అతి చౌక ధరలోనే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం పోకో కంపెనీ శుభవార్త తెలియజేయబోతోంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ పోకో తమ కొత్త మొబైల్‌ Poco M6 4Gను జూన్‌ 11వ తేదిలో విడుదల చేయబోతోంది. ఈ మొబైల్‌ మూడు కలర్‌ ఆప్షన్స్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్‌ను కంపెనీ 6 GB ర్యామ్‌తో పాటు 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 8 GB ర్యామ్‌, 256 GB ఇంటరల్న్ స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకు రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ గతంలో లాంచ్‌ అయిన Redmi 13 4G స్మార్ట్‌ఫోన్‌కి రీబ్రాండెడ్ వెర్షన్‌గా మార్కెట్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్‌ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

పోకో కంపెనీ యుఎస్ వేరియంట్ ధర టీజర్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ఈ Poco M6 4G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే, 6 GB ర్యామ్‌ వేరియంట్ ధర భారత్‌లో దాదాపు రూ. 10,700 నుంచి ప్రారంభమయ్యే ఛాన్స్‌ ఉంది. దీంతో పాటు టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ చూస్తే, 8 GB ర్యామ్ కలిగిన వేరియంట్‌ ‌ధర రూ. 12,400 ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక కంపెనీ ఈ మొబైల్‌ను అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో తీసుకు రాబోతోంది. 

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
ఈ Poco M6 4G మొబైల్‌ సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే, ఇది 6.79 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు 2400x1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో అందుబాటులోకి రానుంది. ఈ  డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌ సెటప్‌తో రానుంది. ఈ మొబైల్‌  MediaTek Helio G91 అల్ట్రా చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. దీనిని కంపెనీ 8 GB ర్యామ్‌, 256 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో అందుబాటులోకి తీసుకు రానుంది. కంపెనీ దీనిని 1TB వరకు స్టోరేజ్‌ను పెంచుకునేందుకు మైక్రో SD కార్డ్‌ సెటప్‌ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఈ మొబైల్‌ కంపెనీ డబుల్‌ కెమెరా సెటప్‌తో అందిస్తోంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఇతర ఫీచర్స్‌:
108-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌ కెమెరా
2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా
13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
5030mAh బ్యాటరీ 
33 వాట్ల వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌
Android 14 ఆధారిత HyperOS
Wi-Fi, 4G LTE
GPS, NFC, బ్లూటూత్ 5.3 
USB టైప్-సి పోర్ట్
IP53 డస్ట్
స్ప్లాష్ రెసిస్టెంట్ రేటింగ్‌

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News