Oppo Reno 12 Pro Price: AI పంక్షన్‌ Oppo Reno 12 Pro ఫోన్‌ వచ్చేసింది.. మరీ ఇంత చీపా?

Oppo Reno 12 Pro Offer Price: ఈ రోజు నుంచి Oppo Reno 12 Pro స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 18, 2024, 12:30 PM IST
Oppo Reno 12 Pro Price: AI పంక్షన్‌ Oppo Reno 12 Pro ఫోన్‌ వచ్చేసింది.. మరీ ఇంత చీపా?

Oppo Reno 12 Pro Offer Price: భారత్‌ మార్కెట్‌లో Oppo Reno 12 Pro స్మార్ట్‌ఫోన్‌ మొదటి సేల్‌ ప్రారంభమైంది. ఈ మొబైల్‌ ప్రీమియం ఫీచర్స్‌తో పాటు ట్రిపుల్‌ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అంతేకాకుండా ఇది లాంచింగ్‌కి ముందే మార్కెట్‌లో మంచి పేరును సంపాదించింది. అలాగే ఇది అద్భుతమైన AI పంక్షన్‌ సెటప్‌తో మిడ్‌ రేంజ్‌లో లాంచ్‌ అయ్యింది. ప్రస్తుతం ఈ మొబైల్‌ ప్రముఖ ఈ కామర్స్‌ ఫ్లిఫ్‌కార్ట్‌ వెబ్‌సైట్‌తో ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఈ సేల్‌ మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలైంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపుతో లభిస్తుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ Oppo Reno 12 Pro స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఇది రెండు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. మొదటిది  12GB ర్యామ్‌, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో రూ.36,999తో లభిస్తోంది. ఇక రెండవ వేరియంట్‌ 12GB ర్యామ్‌, 512GB స్టోరేజ్‌ రూ.40,999తో అందుబాటులో ఉంది. ఇప్పుడే కొనుగోలు చేసేవారికి కంపెనీ రూ.4 వేల వరకు తక్షణ తగ్గింపును కూడా అందిస్తోంది. అంతేకాకుండా నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. ఇక ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ తగ్గింపు ఆఫర్స్‌ కూడా లభిస్తుంది. వీటిని వినియోగించి బిల్ చెల్లించేవారికి బిగ్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది.

Oppo Reno 12 Pro మొబైల్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే, దీనిని కొనుగోలు చేసే క్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా, DBS బ్యాంక్ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ICICI బ్యాంక్, కోటక్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి బిల్‌ చెల్లించి భారీ తగ్గింపు లభిస్తుంది. అలాగే మొదటి సేల్‌లో కొనుగోలు చేసేవారికి ఒప్పో కంపెనీ అదనంగా Google One, YouTube ప్రీమియంను ఉచితంగా మూడు నెలల పాటు అందిస్తోంది. ఇవే కాకుండా ఈ మొబైల్‌పై ఇతర డిస్కౌంట్ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

OPPO రెనో 12 5G ప్రో ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
ఆండ్రాయిడ్ 14 ఆధారిత ColorOS 14.1
డైమెన్సిటీ 7300-ఎనర్జీ ప్రాసెసర్
AI క్లియర్ ఫేస్
AI రైటర్, AI రికార్డింగ్ 
AI ఎరేజర్ 2.0 ఫీచర్‌
50MP ప్రధాన కెమెరా
8MP అల్ట్రా-వైడ్ లెన్స్ కెమెరా
50MP టెలిఫోటో సెన్సార్‌ కెమెరా
50MP సెల్ఫీ షూటర్ 
80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
5000mAh బ్యాటరీ

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News