OPPO K12x 5G Price: బిగ్‌ బిలియన్‌ డేస్‌లో OPPO K12x 5G మొబైల్‌పై రూ.7,950 డిస్కౌంట్.. ఫీచర్స్‌, స్పోక్స్ ఇవే!

OPPO K12x 5G Price: బిగ్‌ బిలియన్‌ డేస్‌లో భాగంగా OPPO K12x 5G స్మార్ట్‌ఫోన్‌ అత్యధిక తగ్గింపు ధరలో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఇతర ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Sep 27, 2024, 01:24 PM IST
OPPO K12x 5G Price: బిగ్‌ బిలియన్‌ డేస్‌లో OPPO K12x 5G మొబైల్‌పై రూ.7,950 డిస్కౌంట్.. ఫీచర్స్‌, స్పోక్స్ ఇవే!

 

OPPO K12x 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్‌ బిలియన్‌ డేస్‌ ప్రారంభమైంది. అన్ని రకాల వస్తువులు డెడ్‌ చీప్‌ ధరల్లో అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌ అతి తక్కువ ధరల్లోనే అందుబాటులోకి వచ్చాయి. ఎప్పటి నుంచో మంచి మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన OPPO K12x 5G మొబైల్‌ అత్యధిక తగ్గింపు ధరలో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు ఫ్లాట్‌ డిస్కౌంట్ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మొబైల్‌ బేస్‌ వేరియంట్‌పై ఊహించని డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో పాటు అదనంగా మరెన్నో ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

ప్రస్తుతం మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇందులోని మొదటి స్టోరేజ్‌ వేరియంట్‌ 128 GB స్టోరేజ్‌, రెండవ వేరియంట్‌ 256 GB స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు మార్కెట్‌లో దీని బేస్‌ వేరియంట్‌ MRP ధర రూ.16,999తో అందుబాటులోకి వచ్చింది. అయితే దీనిని బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా కొనుగొలు చేసేవారికి 23 శాతం తగ్గింపుతో దాదాపు రూ.4,000 వరకు డిస్కౌంట్‌తో లభిస్తోంది. అలాగే అదనంగా తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 

బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా OPPO K12x 5G స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నవారు యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ 5 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. అలాగే HDFC బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌, ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్‌ కార్డ్‌, డెబిట్‌ కార్డ్‌లను వినియోగించి పేమెంట్‌ చేస్తే దాదాపు రూ.1,000 వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారి ఇతర డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ప్రత్యేకంగా ఫ్లిఫ్‌కార్ట్‌ కూపన్స్‌ను కూడా అందిస్తోంది. దీనిపై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.7,950 వరకు తగ్గింపు పొందవచ్చు. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
MediaTek Dimensity 6100+ 5G చిప్సెట్
6.52-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే
50MP ప్రైమరీ సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్
8MP సెల్ఫీ కెమెరా
5000mAh బ్యాటరీ, 33W వేగవంతమైన ఛార్జింగ్
Android 13-ఆధారిత ColorOS 13.1 ఆపరేటింగ్ సిస్టమ్
6GB ర్యామ్ + 128GB స్టోరేజ్, 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్
5G, 4G LTE, Wi-Fi, Bluetooth, GPS, USB-C కనెక్టివిటీ
ఫింగర్‌ప్రింట్ సెన్సార్ (సైడ్-మౌంటెడ్), యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, కాంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News