Oppo F25 5G Price Dropped: ఫ్లిప్‌కార్ట్‌లో సడెన్‌గా తగ్గిన OPPO F25 Pro 5G మొబైల్‌ ధర..రూ.6,999కే పొందే గొప్ప ఛాన్స్‌!

Oppo F25 5G Suddenly Price Dropped: ప్రీమియం కెమెరా కలిగిన మొబైల్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఇటీవలే మార్కెట్‌లో లాంచ్‌ అయిన OPPO F25 Pro 5G స్మార్ట్‌ ఫోన్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 29, 2024, 06:29 PM IST
Oppo F25 5G Price Dropped: ఫ్లిప్‌కార్ట్‌లో సడెన్‌గా తగ్గిన OPPO F25 Pro 5G మొబైల్‌ ధర..రూ.6,999కే పొందే గొప్ప ఛాన్స్‌!

Oppo F25 5G Suddenly Price Dropped: అతి తక్కువ ధరలోనే ప్రీమియం కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌ కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై ప్రత్యేక సేల్‌ ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా ప్రీమియం బ్రాండ్‌కు సంబంధించిన మొబైల్స్ డెడ్ చీప్‌గా లభిస్తున్నాయి. ముఖ్యంగా ఒప్పో ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ చేసిన OPPO F25 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా ప్లాట్‌ తగ్గింపుతో పాటు బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. దీంతో పాటు ఈ మొబైల్‌పై మరిన్ని ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 8 GB ర్యామ్‌, 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగి OPPO F25 Pro 5G స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర MRP రూ.28,999గా ఉండగా బిగ్ బచత్‌ సేల్‌లో భాగంగా 17 శాతం తగ్గింపుతో కేవలం రూ.23,999కే పొందవచ్చు. అలాగే ఈ మొబైల్‌పై అదనంగా తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌ను వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసే క్రమంలో HDFC, ICICI  క్రెడిట్‌ కార్డ్‌లో కొనుగోలు చేస్తే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా తగ్గింపు పొందడానికి Flipkart Axis Bank క్రెడిట్‌ కార్డ్‌ను కూడా వినిగించి కొనుగోలు చేసిన తగ్గింపు పొందవచ్చు. 

ఎక్చేంజ్ ఆఫర్‌:
ఫ్లిప్‌కార్ట్ ఈ OPPO F25 Pro 5G స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఎక్చేంజ్‌ ఆఫర్స్‌లో భాగంగా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేసి కొనుగోలు చేస్తే దాదాపు అదనంగా రూ.17,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్‌ పోను రూ.6,999కే పొందవచ్చు. అయితే ఈ ఎక్చేంజ్ ఆఫర్‌ అనేది పాత స్మార్ట్‌ఫోన్‌ కండీషన్‌ బట్టి అప్లికేబుల్‌ అవుతుంది. 

ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..

ఒప్పో ఎఫ్25 ప్రో 5జీ ఫీచర్లు,స్పెసిఫికేషన్లు:
6.7 అంగుళాల ఫుల్ HD+ (1080 x 2400 పిక్సెల్స్) 10-బిట్ అమోల్డ్ డిస్ప్లే
120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే 
పాండా గ్లాస్ ప్రొటెక్షన్
మీడియాటెక్ డైమెన్సిటీ 7050 SoC ప్రాసెసర్ 
ఆండ్రాయిడ్ 14 ఆధారిత కస్టమ్ యూఐ
64MP ప్రైమరీ సెన్సార్
8MP అల్ట్రావైడ్ సెన్సార్
16MP సెన్సార్ ఫ్రంట్‌ కెమెరా
5000mAh బ్యాటరీ
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది (ఖచ్చితమైన వాట్ శక్తి తెలియదు)
5G SA/NSA, Wi-Fi 6, బ్లూటూత్ 5.3, GPS, USB Type-C
ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్
డ్యూయల్ సిమ్ స్లాట్

ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News