OPPO F21 Pro Cut Price: అమెజాన్‌లో OPPO F21 Pro మొబైల్‌పై భారీ తగ్గిన ధర..అన్ని ఆఫర్స్‌తో రూ.1,999కే పొందండి..

OPPO F21 Pro Cut Price: అతి తక్కువ ధరలోనే మంచి మొబైల్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌..అమెజాన్‌ అందిస్తున్న ప్రత్యేక డీల్‌లో భాగంగా OPPO F21 Pro స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా బ్యాంక్‌ ఆఫర్స్‌ పొందండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2024, 12:13 PM IST
OPPO F21 Pro Cut Price: అమెజాన్‌లో OPPO F21 Pro మొబైల్‌పై భారీ తగ్గిన ధర..అన్ని ఆఫర్స్‌తో రూ.1,999కే పొందండి..

 

OPPO F21 Pro Cut Price: అద్భుతమైన కెమెరాతో కూడిన మంచి స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ కొన్ని శక్తివంతమైన కెమెరాలు కలిగిన మొబైల్‌పై ప్రత్యేక డీల్‌ను అందిస్తోంది. ఈ డీల్స్‌లో భాగంగా OPPO ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ చేసిన F21 Pro స్మార్ట్ ఫోన్‌ కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా ప్లాట్‌ తగ్గింపు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్‌పై అమెజాన్‌లో లభిస్తున్న డిస్కౌంట్‌ ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

OPPO F21 Proపై బంఫర్ తగ్గింపు:
ఒప్పో కంపెనీ మొదట ఈ OPPO F21 Pro స్మార్ట్‌ ఫోన్‌ 8 GB ర్యామ్‌, 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో విడుదల చేసింది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర MRP రూ.27,999 కాగా అమెజాన్‌ ప్రత్యేక డీల్‌లో భాగంగా 39 శాతం తగ్గింపుతో కేవలం రూ.16,999కే లభిస్తోంది. అంతేకాకుండా అదనపు తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.  ఈ స్మార్ట్ ఫోన్‌ను వన్‌కార్డ్‌ బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.1200 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది.

దీంతో పాటు కంపెనీ ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందిస్తోంది. దీని కోసం మీ పాత స్మార్ట్ ఫోన్‌ ఎక్చేంజ్‌ చేసి ఈ కొత్త మొబైల్ కొనుగోలు చేస్తే దాదాపు రూ.15,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ OPPO F21 Pro స్మార్ట్‌ ఫోన్‌ రూ.1,999కే పొందవచ్చు. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

OPPO F21 Pro ఫీచర్స్‌:
OPPO F21 Pro స్మార్ట్‌ ఫోన్‌ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌ 1080x2400 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.43 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ వరకు సపోర్ట్‌ చేస్తుంది. ఈ మొబైల్‌  8 GB ర్యామ్‌, 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. దీంతో పాటు ర్యామ్‌ను అదనంగా 5GB వరకు పెంచుకునే ఆప్షన్‌ కూడా అందిస్తోంది. అలాగే అనేక రకాల ఫీచర్స్‌తో ఈ మొబైల్‌ లభిస్తోంది. 

ఈ మొబైల్‌ స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్‌తో అందుబాటులో ఉంది. ఇక కెమెరా విషయానికొస్తే..ఈ మొబైల్‌ బ్యాక్‌ సెటప్‌లో LED ఫ్లాష్‌తో కూడిన ట్రిపుల్‌ కెమెరా సెటప్‌లను కలిగి ఉంటాయి. ఇందులో మొదటి బ్యాక్‌ కెమెరా 64 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఫ్రాంట్‌ భాగంలో ఈ మొబైల్‌ 32 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుంది.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News