Oppo Best Deals: అతి చౌకగా ఒప్పో మొబైల్స్‌.. రూ.13,999కే 50MP AI కెమెరా మొబైల్స్‌ను పొందండి!

Oppo Best Deals: అతి చౌకగా ఒప్పో స్మార్ట్ ఫోన్స్‌ని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఒప్పోకు సంబంధించి 3 మొబైల్స్‌ డెడ్‌ చీప్‌ ధరలో లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2023, 04:31 PM IST
Oppo Best Deals: అతి చౌకగా ఒప్పో మొబైల్స్‌.. రూ.13,999కే 50MP AI కెమెరా మొబైల్స్‌ను పొందండి!

Oppo Best Deals: ఒప్పో స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌లో కొన్ని మొబైల్స్‌పై ప్రత్యేక డీల్స్‌ నడుస్తున్నాయి. ఈ డీల్స్‌లో భాగంగా ఒప్పో A38, A58, A78 5G స్మార్ట్ ఫోన్‌లను కొనుగోలు చేస్తే MRP కంటే చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయోచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్స్‌పై 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ మొబైల్స్‌పై ప్రత్యేక ఆఫర్స్‌:
Oppo A38:

అధికారిక వెబ్‌సైట్‌లో Oppo A38 స్మార్ట్‌ ఫోన్‌ 4 GB RAM + 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తోంది. ఈ మొబైల్‌ MRP ధర రూ.16,999తో లభిస్తోంది. అయితే ప్రత్యేక డీల్‌లో భాగంగా ఈ Oppo A38 స్మార్ట్‌ ఫోన్‌ రూ.12,999కే పొందవచ్చు. అంతేకాకుండా రూ.1,000 వరకు క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంది. ఇక ఈ మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ వినియోగించి దాదాపు రూ.1,300 వరకు తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను భారీ తగ్గింపుతో పొందవచ్చు. 

Oppo A58:
ఒప్పో A58 స్మార్ట్‌ ఫోన్‌ను అధికారిక ఒప్పో వెబ్‌సైట్‌లో కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ ఫోన్‌ MRP రూ.15,499తో విక్రయిస్తోంది. ప్రత్యేక డీల్‌లో భాగంగా ఫ్లాట్‌ డిస్కౌంట్‌ పోను మీరు రూ.13,999కే పొందవచ్చు. దీంతో పాటు ఈ స్మార్ట్‌ ఫోన్‌పై రూ.1,250 వరకు క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. దీంతో పాటు మొబైల్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే మరింత తగ్గింపు పొందవచ్చు. ఈ Oppo A58 మొబైల్‌  50 మెగాపిక్సెల్ AI కెమెరాతో పాటు 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. 

Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  

Oppo A78 5G:
ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌లో Oppo A78 5G స్మార్ట్‌ ఫోన్‌పై కూడా భారీ తగ్గింపు లభిస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ ఫోన్‌ MRP రూ. 21,999తో కంపెనీ విక్రయిస్తోంది. అయితే ప్రత్యేక డీల్‌లో భాగంగా ప్రస్తుతం ఈ మొబైల్‌ రూ.18,999కే అందుబాటులో ఉంది. దీంతో పాటు మీరు రూ.2,000 వరకు తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు. ఈ మొబైల్‌ ఫోన్‌ 6.56 అంగుళాల HD + డిస్‌ప్లే  90Hz రిఫ్రెష్ రేట్‌ వరకు సపోర్ట్ చేస్తుంది. 

Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News