Oppo A18 Price Cut: ఇంత చీపా..అమెజాన్‌లో డ్రెస్ ధరకే Oppo A18 మొబైల్‌ను పొందండి..రూ.8,000 తగ్గింపు!

Oppo A18 Price Cut: అతి తక్కువ ధరకే మంచి ఒప్పో మొబైల్ ని కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. ప్రత్యేకమైన డీల్స్‌లో భాగంగా ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన ఒప్పో మొబైల్స్ 30 శాతం వరకు తగ్గింపుతో లభిస్తున్నాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 29, 2024, 02:42 PM IST
Oppo A18 Price Cut: ఇంత చీపా..అమెజాన్‌లో డ్రెస్ ధరకే Oppo A18 మొబైల్‌ను పొందండి..రూ.8,000 తగ్గింపు!

Oppo A18 Price Cut: అతి తక్కువ ధరలోనే ఒప్పో స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలనుకుంటున్నారా అమెజాన్ మీ కోసం గొప్ప అవకాశాన్ని అందిస్తోంది ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఒప్పో మొబైల్స్ అమెజాన్ ప్రత్యేకమైన డీల్స్‌లో భాగంగా అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. దీంతోపాటు అదనంగా వాటిపై బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇటీవల మార్కెట్లోకి లాంచ్ అయిన కొత్త మోడల్ ఒప్పో స్మార్ట్‌ఫోన్‌లపై దాదాపు 40 నుంచి 45 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. దీంతోపాటు ఈ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసే వారికి ఇతర బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన ప్రీమియం ఫీచర్స్ కలిగిన 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఒప్పో A18 (Oppo A18) స్మార్ట్ ఫోన్ డెడ్ చీప్ ధరకే లభిస్తోంది. అయితే ఈ మొబైల్ పై ఉన్న ఆఫర్స్ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఒప్పో A18 (Oppo A18) స్మార్ట్ ఫోన్ కూడా ఒకే ఒక స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 4 జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో కూడిన మొబైల్ పై దాదాపు 30 శాతంకు పైగా తగ్గింపు లభిస్తుంది. అమెజాన్‌లో ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర MRP రూ. 13,999 కాగా డే ఆఫ్ ది డీల్‌లో భాగంగా 36 శాతం తగ్గింపుతో రూ.9 వేల లోపే లభిస్తోంది. దీంతోపాటు అదనపు డిస్కౌంట్ ఆఫర్స్‌తో పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ కూడా వినియోగించవచ్చు. ఈ ఆఫర్స్‌లో భాగంగా యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.600 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను రూ. 8,500లోపే ఈ కొత్త మొబైల్‌ను పొందవచ్చు. 

అలాగే ఈ  ఒప్పో A18 (Oppo A18) మొబైల్ ను మరింత తగ్గింపుతో పొందడానికి అమెజాన్ అదనంగా ఎక్స్చేంజ్ బోనస్ ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ను వినియోగించి కొనుగోలు చేయాలనుకునేవారు ముందుగా మీ వద్ద ఉన్న పాత స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ కి ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్చేంజ్ చేస్తే దాదాపు రూ.8,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ బోనస్ అనేది పాత మొబైల్ బ్రాండ్‌తో పాటు కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. మీరు ఎక్స్చేంజ్ చేస్తున్న పాత స్మార్ట్ ఫోన్ కండిషన్ అంతగా లేకపోతే పైన బోనస్‌లో మార్పులు చేర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కండిషన్ బాగుంటే అమెజాన్ అందించే పూర్తి బోనస్ లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్ పోను ఈ  ఒప్పో A18 స్మార్ట్‌ఫోన్‌ రూ. 999కే పొందవచ్చు.

ఒప్పో A18 టాప్‌ ఫీచర్స్‌:
డిస్‌ప్లే:

6.56-అంగుళాల HD+ వాటర్‌డ్రాప్‌ డిస్‌ప్లే
60Hz రిఫ్రెష్‌ రేట్‌

ప్రాసెసర్‌:
MediaTek Helio P35 ఆక్టా-కోర్‌ ప్రాసెసర్‌

ర్యామ్‌ & స్టోరేజ్‌:
4GB ర్యామ్‌
64GB స్టోరేజ్‌
మైక్రో SD కార్డ్‌ ద్వారా 1TB వరకు విస్తరించుకోవచ్చు.

కెమెరా:
వెనుక భాగంలో 13MP ప్రధాన కెమెరా + 2MP మాక్రో కెమెరా + 2MP డెప్త్‌ కెమెరా
ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

బ్యాటరీ:
5000mAh బ్యాటరీ
18W ఫాస్ట్‌ చార్జింగ్‌

ఇతర ఫీచర్స్‌:
Android 11
ColorOS 11.1
3.5mm హెడ్‌ఫోన్‌ జాక్‌
ఫేస్‌ అన్‌లాక్‌
ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News