OnePlus Power Bank: వన్‌ప్లస్ నుంచి సరికొత్త పవర్ బ్యాంక్, తొలిసారి ల్యాప్‌టాప్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు

OnePlus Power Bank: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ గ్యాడ్జెట్స్‌పై దృష్టి సారించింది. తొలిసారిగా అత్యంత శక్తివంతమైన పవర్ బ్యాంక్ లాంచ్ చేయనుంది. గ్యాడ్జెట్స్ చరిత్రలోనే ఈ తరహా పవర్ బ్యాంక్ బహుశా ఇదే కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 23, 2024, 07:35 AM IST
OnePlus Power Bank: వన్‌ప్లస్ నుంచి సరికొత్త పవర్ బ్యాంక్, తొలిసారి ల్యాప్‌టాప్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు

OnePlus Power Bank: వన్‌ప్లస్ సంస్థ నుంచి కొత్త ఉత్పత్తులు లాంచ్ కానున్నాయి. మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్, ట్యాబ్లెట్, బడ్స్‌తో పాటు తొలిసారిగా పవర్ బ్యాంక్ ప్రవేశపెడుతోంది. ఇదొక సూపర్ ఫ్లాష్ పవర్ బ్యాంక్. ఈ తరహా పవర్ బ్యాంక్ మార్కెట్‌లో ఇదే మొదటిది. జూన్ 27న చైనాలో జరిగే లాంచ్ ఈవెంట్ ఇందుకు వేదిక.

OnePlus 100W సూపర్‌ఫ్లాష్ పవర్ బ్యాంక్ 12000 ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. వన్‌ప్లస్ నుంచి మార్కెట్‌లో విడుదల కానున్న తొలి వపర్ బ్యాంక్ ఇది.  ఈ పవర్ బ్యాంక్ డ్యూయల్ టోన్ ఫినిష్‌తో అద్భుతమైన లుక్‌తో రెక్టాంగిల్ స్లాబ్ డిజైన్ కలిగి ఉంటుంది. యూఎస్‌బీ టైప్ సి, టైప్ ఎ పోర్ట్ ఉంటుంది. ఇప్పటి వరకూ మార్కెట్‌లో ఉన్న పవర్ బ్యాంక్‌లకు ఇది భిన్నమైంది. దీంతో స్మార్ట్‌వాచెస్, స్మార్ట్‌ఫోన్లే కాకుండా తొలిసారిగా ల్యాప్‌టాప్‌లు కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ల్యాప్‌ట్యాప్ ఛార్జ్ చేసే పవర్ బ్యాంక్ బహుశా ఇదే మొదటిది కావచ్చు. అందుకే వన్‌ప్లస్ లాంచ్ చేయబోతున్న పవర్ బ్యాంక్‌పై చాలా అంచనాలున్నాయి.

ఇక ఇదే రోజు జూన్ 27న OnePlus Ace3 Pro లాంచ్ కానుంది. ఈ ఫోన్ 6100 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో పనిచేస్తుంది. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. 6.78 ఇంచెస్ 1.5కే రిజల్యూషన్ డిస్‌ప్లేతో వస్తోంది. ఇది స్నాప్‌డ్నాగన్ 8 జనరేషన్ 3 చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో ట్రిపుల్ కెమేరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ సెన్సార్ కెమేరాలున్నాయి. సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. పవర్ బ్యాంక్, స్మార్ట్‌ఫోన్‌తో పాటు Oneplus Pad Pro ట్యాబ్లెట్,  OnePlus Buds 3 కూడా లాంచ్ కానున్నాయి. 

Also read: ITR Filing: ఆ పని చేయకపోతే మీ ఐటీ రిటర్న్స్ రిజెక్ట్ అవుతాయి జాగ్రత్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News