Oneplus 11 5g: త్వరలోనే భారత మార్కెట్‌లోకి Oneplus 11 5g స్మార్ట్‌ ఫోన్‌ .. ఫీచర్స్‌ అన్ని అదుర్స్‌..

Oneplus 11 5g: భారత దేశంలో OnePlus 11 స్మార్ట్‌ ఫోన్‌ను ఫిబ్రవరి 7న విడుదల కానుంది. అయితే దీని సంబంధించి వివరాలు వన్‌ప్లస్‌ ఇంకా వివరించ లేదు. కానీ ఇతర దేశాల్లో లాంచ్‌ అయ్యింది. అక్కడ విడుదల చేసిన స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్స్‌ ఎంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2023, 06:07 PM IST
Oneplus 11 5g: త్వరలోనే భారత మార్కెట్‌లోకి Oneplus 11 5g స్మార్ట్‌ ఫోన్‌ .. ఫీచర్స్‌ అన్ని అదుర్స్‌..

Oneplus 11 5g: OnePlus కంపెనీ అతి త్వరలో OnePlus 11ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతోందని అధికారిక ప్రకటన చేసింది. అయితే ఈ ఫోన్‌ను వచ్చే నెల మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఉత్తర అమెరికా, యూరప్ ఇతర చాలా దేశాల్లో ఇప్పటికే లాంచ్‌ చేశారు. అయితే యూరోపియన్ ప్రాంతానికి చెందిన ధరలు మాత్రం వెలుగులోకి వచ్చాయి. భారత దేశంలో ఈ ఫోన్‌ విడుదలైతే ఎంత ధర ఉంటుందో, కొత్త ఫీచర్లు, మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

OnePlus 11 స్పెసిఫికేషన్స్‌:
అమెజాన్(Amazon)లో ఇప్పటికే ప్రీ-ఆర్డర్ తేదీని కూడా ఖరారు చేసింది. యూఎస్‌లో విడుదల చేసిన OnePlus 11 స్మార్ట్‌ ఫోన్‌ విషయానికొస్తే.. ఇది 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. అంతేకాకుండా 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, చాలా రకాల కొత్త ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కేవలం 25 నిమిషాల పాటు దీనిని ఛార్జ్‌ చేస్తే మొబైల్‌బ్యాటరీ ఫుల్‌ అవుతుంది.

OnePlus 11 లాంచ్ తేదీ:
ఉత్తర అమెరికాలో ఈ ఫోన్ కేవలం 16GB ర్యామ్‌, 256జీబీ ఇంటర్నాల్‌ స్టోరేజ్‌తో మాత్రమే విడుదల చేశారు. ఇతర దేశాల్లో మాత్రం 512GB స్టోరేజ్‌తో విడుదల చేస్తున్నట్లు సమాచారం. దీని విడుదల తేది విషయానికొస్తే ఈ ఫిబ్రవరి 7న విడుదల కానుందని సమాచారం. అయితే అదే రోజు ప్రీ-ఆర్డర్‌లు ప్రారంభమవుతాయి.

భారతదేశంలో OnePlus 11 ధర:
ఇతర దేశాల్లో విడుదలైన ధరలతో పోల్చుకుని చూస్తే OnePlus 11 భారత్‌ రూ. 1,000 నుంచి రూ.2,000 పెరిగే అవకాశాలున్నాయి. యూరప్ 8 GB RAM + 128 GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర 899 యూరోలు కాగా భారత్‌లో దాని ధర రూ. 79,960 ఉండే అవకాశాలున్నాయి. అయితే టాప్ వేరియంట్ 16GB RAM + 256GB స్టోరేజ్ గల ఈ స్మార్ట్‌ ఫోన్‌ 949 యూరోలకు (రూ. 84,407) విక్రయిస్తోంది. 

Also Read: Tax Saving Schemes 2023: ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి.. ఆదాయంతోపాటు సూపర్ బెనిఫిట్స్  

Also Read: Shubman Gill: ఉప్పల్‌లో పరుగుల ఉప్పెన.. చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News