వన్‌ ప్లస్‌ నార్డ్‌ సీఈ 3 5G ఇండియాలో వచ్చేసింది.. ఇదుగో వివరాలు

ఫోన్ల అమ్మకాల్లో వన్‌ ప్లస్‌ కి  ప్రాముఖ్యత ఉంది. ఇండియన్ మార్కెట్లో  వన్ ప్లస్ కి  గురించి చెప్పనక్కర్లేదు. తాజాగా ఇండియాలో కొత్త మోడల్‌ ను వన్ ప్లస్‌ మార్కెట్ లోకి తీసుకు వచ్చింది. వన్‌ ప్లస్‌ నార్డ్ CE 3 5జీ మొబైల్ ఫీచర్లు, ధర వివరాలు.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 5, 2023, 05:48 PM IST
వన్‌ ప్లస్‌ నార్డ్‌ సీఈ 3 5G ఇండియాలో వచ్చేసింది.. ఇదుగో వివరాలు

ఇండియాలో గత నాలుగు అయిదు సంవత్సరాల్లో ఆండ్రాయిడ్ ఫోన్‌ ల వినియోగం విపరీతంగా పెరిగింది. దేశ వ్యాప్తంగా మొబైల్‌ ఫోన్‌ ల వినియోగం విపరీతంగా పెరగడంతో చైనాకు చెందిన పలు కంపెనీల ఉత్పత్తులు దేశంలో భారీగా అమ్ముడు పోతున్నాయి. ఇండియాలో అధికంగా విక్రయాలు లేకున్నా కూడా అత్యంత ఖరీదైన ఫోన్ గా ఐఫోన్ నిలిచింది. 

చాలా మంది ఐ ఫోన్ ను డ్రీమ్‌ ఫోన్ గా భావిస్తూ ఉంటారు. ఐ ఫోన్ తర్వాత చాలా మంది కోరుకుంటున్న బ్రాండ్‌ వన్‌ ప్లస్‌. కాస్త రేటు ఎక్కువ అయినా కూడా వన్‌ ప్లస్ ను కొనుగోలు చేసేందుకు చాలా మంది పోటీ పడుతున్నారు. అందుకే సదరు కంపెనీ కొత్త కొత్త మోడల్స్ ను ఇండియాలో లాంచ్ చేస్తూనే ఉంది. తాజాగా ఇండియాలో కొత్త మోడల్‌ ను వన్ ప్లస్‌ మార్కెట్ లోకి తీసుకు వచ్చింది. 

వన్‌ ప్లస్‌ నార్డ్ 3 5జీ ఫోన్‌ గురించి కంపెనీ ఈ మధ్య కాలంలో తెగ ప్రచారం చేయడం జరిగింది. దాంతో చాలా మంది ఆ మోడల్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫోన్‌ లు కొనుగోలు చేయాలని భావిస్తున్న వారు ఆ ఫోన్ వచ్చిన తర్వాత బుక్ చేసుకునేందుకు వెయిట్‌ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. 

చూడ్డానికి మరియు ఫీచర్స్‌ అన్నీ కూడా ఐ ఫోన్‌ మాదిరిగా ఈ ఫోన్‌ ఉంటుందని రివ్యూవర్స్ కూడా ప్రచారం చేయడం వల్ల చాలా మంది కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఈ మోడల్‌ ధరను రూ.26,999 గా నిర్ణయించడం జరిగింది. ఈ ఫోన్‌ ప్రస్తుతం ఉన్న పలు కంపెనీల 5జీ ఫోన్ లతో పోల్చితే అద్భుతంగా పని చేస్తుందని సదరు కంపెనీ వారు నమ్మకంగా చెబుతున్నారు. 

Also Read: Pawan Kalyan: ఆ లక్ష్యంతోనే పదేళ్ల పాటు పార్టీని నిర్మించుకున్నా.. చాలా ఇష్టంతో ఇక్కడికి వచ్చా: పవన్ కళ్యాణ్‌  

ఇక వన్ ప్లస్ నార్డ్‌ సీఈ 3 5జీ ఫోన్‌ ఫీచర్ల విషయానికి వస్తే... 8GB RAM, 128GB  ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అంతే కాకుండా 12GB RAM, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ తో కూడా వచ్చింది. రెండు వేరియేషన్స్‌ కు కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే తేడా. ఇప్పటికే అమెజాన్ ఈ ఫోన్‌ ల సేల్ మొదలు పెట్టింది. 

అంతే కాకుండా వన్‌ ప్లస్‌ అధికారిక వెబ్‌ సైట్‌ లో కూడా ఈ ఫోన్‌ ను అమ్మకానికి పెట్టినట్లుగా కంపెనీ వర్గాల వారు ప్రకటించారు. 6.7 ఇంచుల ఫుల్‌ హెచ్ డీ స్క్రీన్ తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌, HDR10+ సపోర్ట్‌ ఉంది. 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో సెన్సార్ కెమెరా ఉంది. 

Android 13 OS తో ఈ ఫోన్ రన్ అవుతోంది. ఇంకా ఎన్నో ఐ ఫోన్‌ ఫీచర్స్ ను ఈ ఫోన్ లో వన్ ప్లస్ వారు ఇవ్వడం జరిగింది. వినియోగదారుల కోసం అద్భుతమైన అనుభూతి కలిగించేందుకు వన్‌ ప్లేస్ ఈ కొత్త మోడల్ తీసుకు వచ్చిందని కంపెనీ వర్గాల వారు అంటున్నారు.

Also Read: Telangana Assembly Live: తలసరి ఆదాయంలో తెలంగాణదే అగ్రస్థానం: మంత్రి హరీశ్ రావు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News