Whatsapp Insta Services: అర్థరాత్రి నిలిచిపోయిన వాట్సప్, ఇన్‌స్టా సేవలు, నెటిజన్ల ఆందోళన

Whatsapp Insta Services: ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సప్, ఇన్‌స్టా గ్రామ్ సేవలకు అర్ధరాత్రి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో ఒక్కసారిగా యూజర్లు గగ్గోలు పెట్టారు. దాదాపు గంట తరువాత సేవలు పునరుద్ధరణయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 4, 2024, 03:43 AM IST
Whatsapp Insta Services: అర్థరాత్రి నిలిచిపోయిన వాట్సప్, ఇన్‌స్టా సేవలు, నెటిజన్ల ఆందోళన

Whatsapp Insta Services: మెటా ఆధ్వర్యంలో నడుస్తున్న ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు ఇటీవలి కాలంలో తరచూ అంతరాయం ఏర్పడుతోంది. ఇటీవలే 15 రోజుల వ్యవదిలో ఫేస్‌బుక్, ఇన్‌స్టా సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాట్సప్, ఇన్‌స్టా సేవలు నిలిచిపోవడంతో ఒక్కసారిగా జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

మొన్న ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు..ఇప్పుడు వాట్సప్, ఇన్‌స్టా సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏప్రిల్ 3వ తేదీ రాత్రి 11.22 గంటల ప్రాంతంలో అటు వాట్సప్, ఇటు ఇన్‌స్టాగ్రామ్ రెండింట్లోనూ సమస్య ఏర్పడి సేవలు నిలిచిపోయాయి. రాత్రి 11.37 గంటలయ్యే సరికి సర్వర్ పూర్తి డౌన్ అయిపోయింది. దాంతో సేవలు ఆగిపోయాయి. దాంతో నెటిజన్లు ఇతర సోషల్ మీడియో వేదికలపై సమస్యను నివేదిస్తూ గగ్గోలు పెట్టారు. కొంతమందికి వాట్సప్ వెబ్ ఆప్షన్ ఓపెన్ కాలేదు. మరి కొందరికి మెస్సేజ్‌లు పంపించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

వాట్సప్, ఇన్‌స్టాలో సమస్య ఎదురైన కేవలం 15 నిమిషాల వ్యవదిలోనే 5 వేలకుపైగా ఫిర్యాదులు ఇతర సోషల్ మీడియా వేదికలపై వెల్లువెత్తాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. కొంతమంది అప్పటికప్పడు మీమ్స్ కూడా వదిలారు. రాత్రి 12 గంటలు దాటేవరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. అటు మెటా కూడా ఈ సమస్యపై ఎక్స్ వేదికగా స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది యూజర్లు వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు పొందలేకపోతున్నట్టు ఫిర్యాదులు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 11.45 గంటలు సమస్య ప్రారంభమైనట్టు గుర్తించామని మెటా తెలిపింది. సాధ్యమైనంత త్వరలో సమస్యను పరిష్కరించి మరింత మెరుగైన సేవలు అందిస్తామని తెలిపింది. 

Also read: NEET MDS Results 2024: నీట్ ఎండీఎస్ 2024 ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News