Lava Storm 5G Price In India: మిడిల్ రేంజ్ బడ్జెట్‌లో లభించే స్మార్ట్ ఫోన్స్‌కి మంచి డిమాండ్ ఉంది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ మొబైల్ కంపెనీలు ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్ ఫోన్‌ను అతి తక్కువ ధరలోనే మార్కెట్‌లో విక్రయిస్తున్నాయి. ఇటీవలే విడుదలైన అతి తక్కువ అతి ధరలో లభించే మొబైల్స్‌లో Lava Yuva 3 Pro ఒకటి. దీనిని ప్రముఖ టెక్ కంపెనీ లావా ప్రీమియం ఫీచర్స్‌తో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే తరహాలో లావా డిసెంబర్ చివరి వారంలో మరో మొబైల్‌ను లాంచ్ చేయబోతోంది. ఈ మొబైల్ అతి చౌకగా లభించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ Lava స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ టెక్ కంపెనీ Lava తమ మరో మొబైల్‌ను Storm 5G పేరుతో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 21న భారతదేశ వ్యాప్తంగా విడుదల చేయబోతుందని ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ తెలిపారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించి ఫీచర్స్‌ను కంపెనీ ఇంకా అధికారకంగా వెల్లడించలేదు. కానీ కంపెనీ ఈ మొబైల్‌కి సంబంధించి ఫోటోలను మాత్రం ఇటీవలే షేర్ చేసింది. ప్రస్తుతం ఈ Lava Storm 5G స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Lava Storm 5G లీకైన ఫీచర్స్:
ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం..ఈ Lava Storm 5G స్మార్ట్ ఫోన్ ఫ్లాట్ ఫ్రేమ్, ఫ్లాట్ అంచుల డిజైన్‌ను కలిగి ఉంటుంది. అలాగే బ్యాక్‌లో ఎత్తైన కెమెరా మాడ్యూల్‌తో రాబోతోంది. వెనుక రెండు కెమెరా లెన్స్‌లతో పాటు ప్రోట్రూషన్‌లో LED ఫ్లాష్ ఉంటుంది. కుడి వైపున పవర్ బటన్, వాల్యూమ్ రాకర్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ MediaTek Dimensity 6080 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలైన Redmi Note 13, Note 13R Pro, Tecno Pova 5 Pro స్మార్ట్ ఫోన్ కూడా ఇదే ప్రాసెసర్‌ను కలిగి ఉంటాయి.
అలాగే ఈ స్మార్ట్ ఫోన్ 8GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్‌తో రాబోతోందని టిప్‌స్టర్ వెల్లడించింది. ఇక ఈ మొబైల్ 8MP అల్ట్రా-వైడ్ కెమెరాతో పాటు ప్రైమరీ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇతర శక్తివంతమైన ఫీచర్స్‌తో రాబోతోంది. అయితే ఈ మొబైల్ ధర విషయానికొస్తే..ఇటీవలే విడుదల చేసిన స్మార్ట్ ఫోన్స్ కంటే తక్కువ ధరలోనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. టిప్‌స్టర్ అంచనాల ప్రకారం..ఈ Lava Storm 5G మొబైల్ ఫోన్ రూ.15,000 లోపే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి