Jio Bharat b2: 343 గంటల స్టాండ్‌బై బ్యాటరీతో మార్కెట్‌లోకి Jio Bharat B2 మొబైల్‌..ఫీచర్స్‌, ధర వివరాలు!

Jio Bharat b2 Mobile: భారీతీయ టెక్‌ కంపెనీ Jio Bharat శుభవార్త తెలిపింది. త్వరలోనే మార్కెట్‌లోకి Jio Bharat B1 మొబైల్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఈ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 16, 2024, 04:11 PM IST
Jio Bharat b2: 343 గంటల స్టాండ్‌బై బ్యాటరీతో మార్కెట్‌లోకి Jio Bharat B2 మొబైల్‌..ఫీచర్స్‌, ధర వివరాలు!

Jio Bharat b2 Mobile: ప్రముఖ భారతీయ టెక్‌ కంపెనీ Jio Bharat గుడ్‌ న్యూస్‌ తెలిపింది. అతి తక్కువ ధరలోనే మార్కెట్‌లోకి Jio Bharat B2 మొబైల్‌ను త్వరలోనే విడుదల చేయబోతోంది. జీయో విడుదలకు సంబంధించిన తేదిని అధికారికంగా ప్రకటించక ముందే ప్రముఖ టిప్‌స్టర్స్‌ ఎక్స్ ఖాతాలో లీక్‌ చేశారు. అయితే ఈ ఫోన్‌ గత సంవత్సవరంలో విడుదల చేసిన జియో భారత్ B1కి  సక్సెర్‌గా రాబోతున్నట్ల టిప్‌స్టర్స్‌ తెలిపారు. ఇంతక ముందు లాంచ్‌ చేసిన  B1 ఫోన్‌ 4G కనెక్టివిటీతో పాటు  UPI చెల్లింపు ఫీచర్స్‌ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంది. 

ఈ మొబైల్‌ భారత్‌లోని అన్ని భాషలను సపోర్ట్‌ను చేస్తోంది. అయితే లాంచ్‌ కాబోయే Jio Bharat B2 మొబైల్‌ JBB121B1 మోడల్ నంబర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు BIS వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ మొబైల్‌ సంబంధించిన కొన్ని ఫీచర్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వాటి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ప్రముఖ టెక్‌ వెబ్‌సైట్‌ తెలిపిన వివరాల ప్రకారం..ఈ Jio Bharat B2 మొబైల్‌కు సంబంధించిన అధికారిక వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదని కానీ కొందరు టిప్‌స్టర్‌ మాత్రం  BIS వెబ్‌సైట్‌లో పేర్కొన్న ఫీచర్స్‌ను లీక్‌ చేశారని తెలిపింది. త్వరలోనే లాంచ్‌ కాబోయే ఈ Bharat B2 ఫోన్‌ 2.4 అంగుళాల QVGA డిస్ప్లేను కలిగి ఉంటే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ డిస్ల్పే Threadx RTOS సపోర్ట్‌తో అందుబాటులోకి రానుంది. కంపెనీ ఈ మొబైల్స్‌ను ముందుగా బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్‌లలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు టిప్‌స్టర్స్‌ తెలిపారు.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

అలాగే ఈ మొబైల్‌ 50MB ర్యామ్‌, 4G, Wi-Fi, USB కనెక్టివిటీలతో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు నానో సిమ్ కార్డ్‌ సపోర్ట్‌తో దీనిని విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఈ మొబైల్ 2,000mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే 343 గంటల స్టాండ్‌బై బ్యాటరీని కూడా అందిస్తోంది. ఇవే కాకుండా జియో JioCinemaతో పాటు JioSaavn ఇన్‌బిల్ట్‌ ఇన్‌స్టాలేషన్‌తో అందిస్తోంది. అంతేకాకుండా జియోపే వినియోగదారులకు యూపిఐ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. ఇక దీని ధర విషయానికొస్తే ఇంతక ముందు లాంచ్‌ చేసిన Bharat B1 మొబైల్‌ కంటే రూ.500 అదనపు ధరతో 2 వేల లోపే ఉండే అవకాశాలు ఉన్నాయి. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News