Jio Recharge Offers: జియో కస్టమర్లకు అదిరిపోయే డేటా ప్లాన్స్.. తక్కువ ధరలో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే..!

Jio Data Recharge Plans 2024: దేశంలోనే నెంబర్ వన్ టెలికాం సంస్థగా కొనసాగుతున్న జియో.. ఎప్పటికప్పుడు సరికొత్త రీఛార్జ్‌ ప్లాన్‌లను ప్రకటిస్తూ కస్టమర్లను మరింతగా ఆకర్షిస్తోంది. తాజాగా రూ.19, రూ.29తో డేటా రీఛార్జ్ ప్లాన్స్‌ను తీసుకువచ్చింది. పూర్తి వివరాలు ఇలా..   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2024, 10:02 PM IST
Jio Recharge Offers: జియో కస్టమర్లకు అదిరిపోయే డేటా ప్లాన్స్.. తక్కువ ధరలో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే..!

Jio Data Recharge Plans 2024: సరికొత్త ఆఫర్లతో కస్లమర్లను ఆకట్టుకునేందుకు జియో రెడీ అవుతోంది. ప్రతిసారి సరికొత్త రీఛార్జ్ ఆఫర్లు ప్రకటిస్తున్న జియో.. తాజాగా తన వినియోగదారుల కోసం తక్కువ రేటులో డేటా ప్యాక్‌లను పరిచయం చేసింది. తన రెండు డేటా బూస్టర్ ప్లాన్‌లను మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.19, రూ.29కి రెండు డేటా ప్లాన్‌లను తీసుకువచ్చింది. ఈ డేటా ప్యాక్‌లు కస్టమర్లు అందరికీ అందుబాటులో ఉన్నాయి. రోజువారీ డేటా ప్లాన్ త్వరగా అయిపోతున్నట్లయితే.. ఇక నుంచి ఎలాంటి టెన్షన్ పడాల్సిన పనిలేదు. 

రూ.19 రీఛార్జ్ ప్లాన్ ఇలా..
 
రూ.19 డేటా ప్లాన్‌ను పరిచయం చేసింది జియో. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఇంతకంటే తక్కువలో జియో 15 రూపాయల ప్లాన్ కూడా ఉంటుంది. అయితే ఈ ప్లాన్‌లో ఒక జీబీ డేటా మాత్రమే అందుతుంది. ఈ నేపథ్యంలో మరో 4 రూపాయలు ఎక్కువ ఖర్చు చేస్తే.. వినియోగదారులకు 0.5 GB అదనపు డేటాను లభిస్తుంది.

రూ.29 రీఛార్జ్ ప్లాన్ ఇలా.. 

తక్కువ మొత్తంలో డేటా ప్లాన్‌ కావాలనుకునే వారికి రూ.29 రీఛార్జ్‌ ప్లాన్ కూడా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. రూ.29తో రీఛార్జ్ చేసుకుంటే.. వినియోగదారులకు 2.5 GB డేటాను లభిస్తుంది. ఇంతకంటే తక్కువలో 25 రూపాయల డేటా ప్లాన్‌ను కూడా జియో తీసుకువచ్చింది. ఇందులో యూజర్లకు 2 జీబీ డేటా లభిస్తుంది. అయితే మరో రూ.4 అదనంగా ఖర్చు చేస్తే.. వినియోగదారులకు 0.5 GB అదనపు డేటాను పొందొచ్చు. తక్కువ బడ్జెట్‌లో డేటాను వినియోగించుకోవాలనుకునే కస్టమర్లకు ఈ ప్లాన్‌లు సూపర్‌గా సెట్ అవుతాయి. 

Also Read: One Man Five Women Preganant: వీడు మగాడ్రా బుజ్జి.. 22 ఏళ్లకే ఐదుగురు భార్యలు, ఒకేసారి తల్లులు కాబోతున్నారు

Also Read: Bike Buys with Coins: పూజారి "చిల్లర ప్రేమ" కథ వినండి.. వీరి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News