iQOO Z9x 5G Price Drop: ప్రముఖ వీవో సబ్ బ్రాండ్ iQOO మార్కెట్‌లో గొప్ప పేరును సంపాదించుకుంది. ప్రీమిమం ఫీచర్స్‌తో అత్యధిక తగ్గింపుతో మంచి స్మార్ట్‌ఫోన్స్‌ను విక్రయిస్తూ వస్తోంది. ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్ అయిన iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్‌కి మంచి డిమాండ్ ఉంది. యువత ఎక్కువగా ఈ మొబైల్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మీరు కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ను అత్యధిక తగ్గింపుతో కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన 6000mAh బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు 44W Flash ఛార్జింగ్ సపోర్ట్‌తో రానుంది. అయితే ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
ఈ iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్ కంపెనీ మే నెలలో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌తో పాటు అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే దీనిని అమెజాన్‌లో కొనుగోలు చేసేవారికి బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్ చేస్తే దాదాపు భారీ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాకుండా మరెన్నో ఆఫర్స్ లభిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఇందులోని బేస్ వేరియంట్ (128GB స్టోరేజ్)పై ప్రత్యేకమైన తగ్గింపు లభిస్తోంది. దీనిని అమెజాన్‌లో ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ & డెబిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.1,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లించిన తగ్గింపు పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇక ఈ మొబైల్‌పై ఉన్న అన్ని ఆఫర్స్ పోను దీనిని కేవలం రూ.11,998కే పొందవచ్చు. ఇవే కాకుండా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్ చేస్తే దాదాపు రూ. 12 వేల వరకు ఎక్చేంజ్ బోనస్ పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌పై బోనస్ అనేది పాత స్మార్ట్‌ఫోన్ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఈ మొబైల్ గ్రీన్, గ్రే కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న మరిన్ని ఆఫర్స్ తెలుసుకోవడానికి అమెజాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
iQOO Z9x 5G స్పెసిఫికేషన్స్:
6.72-అంగుళాల డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
1000నిట్‌ల గరిష్టమైన బ్రైట్‌నెస్
Qualcomm Snapdragon 6 Gen 1 ప్రాసెసర్
డ్యూయల్ స్పీకర్లు
ఆండ్రాయిడ్ 14 ఆధారంగా FuntouchOS 14
6000mAh బ్యాటరీ
44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
50MP ప్రధాన కెమెరా
2MP సెకండరీ సెన్సార్ కెమెరా
8MP ఫ్రంట్ కెమెరా
Also Read: Virat Kohli: భారత్‌కు దూరంగా కోహ్లీ, అనుష్క.. బ్రిటన్‌లో సెటిల్ అయ్యేందుకు ప్లాన్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.