Iqoo 12 Price: iQOO నుంచి మార్కెట్‌లోకి మరో మొబైల్‌..ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్స్‌పై Iphone 15 కూడా పనికి రాదు!

Iqoo 12 Price: త్వరలోనే మార్కెట్‌లోకి Vivo సబ్-బ్రాండ్ iQOO మరో స్మార్ట్ ఫోన్ విడుదల కాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ iQOO 12, iQOO 12 ప్రో వేరియంట్లలో లభించనుంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్లు, మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 8, 2023, 01:01 PM IST
Iqoo 12 Price: iQOO నుంచి మార్కెట్‌లోకి మరో మొబైల్‌..ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్స్‌పై Iphone 15 కూడా పనికి రాదు!

 

Iqoo 12 Price: ప్రముఖ టెక్‌ కంపెనీ Vivo సబ్-బ్రాండ్ iQOO ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా చైనాలో విడుదల చేసింది. iQOO 12 సిరీస్‌ను కంపెనీ మార్కెట్‌లో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్‌ రెండు వేరియంట్‌లో లభిస్తోంది. ఈ మొబైల్‌ iQOO 12, iQOO 12 ప్రో వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ భారత్‌లో డిసెంబర్ 9న మార్కెట్‌లోకి అందుబాటులో రాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ఈ మొబైల్‌ ఫోన్‌కి సంబంధించిన హార్డ్‌వేర్, స్పెసిఫికేషన్‌ల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

iQOO 12, iQOO 12 ప్రో స్పెసిఫికేషన్‌లు:
ఈ iQOO 12 స్మార్ట్‌ ఫోన్‌ 6.78-అంగుళాల, 2800 × 1260 పిక్సెల్‌లు  AMOLED డిస్‌ప్లేతో రాబోతోంది. ఈ  డిస్‌ప్లే 144 Hz రిఫ్రెష్ రేట్‌తో సపోర్ట్‌ చేస్తుంది. అంతేకాకుండా  3,000 nits పీక్ వరకు బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. iQOO 12 ప్రో Quad HD కర్వ్డ్ E7 LTPO AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. 
 
రెండు స్మార్ట్‌ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 16GB RAM + 1TB స్టోరేజ్‌ వేరియంట్‌లో లభిస్తోంది. iQOO 12 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. iQOO 12 Pro 120W అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 5100mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. రెండు స్మార్ట్‌ఫోన్‌లు Android 14 ఆధారిత FuntouchOS 14పై రన్ అవుతున్నట్లు కంపెనీ పేర్కొంది.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

ఈ iQOO 12 స్మార్ట్‌ఫోన్‌ 50MP ఓమ్నివిజన్ OV50H సెన్సార్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరాతో రాబోతోంది. ఈ కెమెరా 3x జూమ్ సపోర్ట్‌తో 64MP టెలిఫోటో కెమెరాను కూడా కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది.

iQOO 12, iQOO 12 Pro ధర:
ఈ iQOO 12 (12 GB RAM +  256 GB) వేరియంట్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ చైనాలో 3999 యువాన్లుకు అందుబాటులో ఉంది. భారత్‌లో ఈ మొబైల్‌ రూ. 45,715తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. టాప్-ఎండ్ వేరియంట్ ధర 4,699 యువాన్స్‌ అయితే..భారత్‌లో రూ. 49,915కు లభించనుంది. 16 GB RAM + 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన టాప్-ఎండ్ iQOO 12 Pro ధర 4999 యువాన్లు కాగా దాదాపు రూ. 58,045కు లభించనుంది. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News