iPhone 14 Pre Booking Date: ఐఫోన్ 14 ప్రీ బుకింగ్ ఎప్పటి నుంచి, ధర ఎంతో తెలుసా

iPhone 14 Pre Booking Date: ఐఫోన్ 14, ఐపోన్ 14 ప్రో సెప్టెంబర్ నెలలో విడుదల కానున్నాయి. ప్రీ ఆర్డర్ బుకింగ్ ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు, ధర ఎంత ఉండే అవకాశాలున్నాయో పరిశీలిద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 21, 2022, 10:53 PM IST
iPhone 14 Pre Booking Date: ఐఫోన్ 14 ప్రీ బుకింగ్ ఎప్పటి నుంచి, ధర ఎంతో తెలుసా

iPhone 14 Pre Booking Date: ఐఫోన్ 14, ఐపోన్ 14 ప్రో సెప్టెంబర్ నెలలో విడుదల కానున్నాయి. ప్రీ ఆర్డర్ బుకింగ్ ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు, ధర ఎంత ఉండే అవకాశాలున్నాయో పరిశీలిద్దాం..

యాపిల్ ఐఫోన్ 14 లాంచ్ ఈవెంట్ తేదీ దాదాపుగా నిర్ధారణైంది. సెప్టెంబర్ 7వ తేదీన ఐఫోన్ 14 నాలుగు వేరియంట్లలో విడుదల కానుందని తెలుస్తోంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ కోసం ఐఫోన్ ప్రేమికులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్ననారు. అయితే ఐఫోన్ 14 లాంచ్ అవగానే విక్రయాలు ప్రారంభించేందుకు మరో పది రోజులు పడుతుంది. ఈ నేపద్యంలో ప్రీ బుకింగ్ ప్రారంభమౌతుంది. ఐఫోన్ 14 ప్రీ బుకింగ్ చేసుకుంటే త్వరగా చేతికి అందే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో ఐఫోన్ 14 ప్రీ బుకింగ్ ఎప్పుడు, ఎంత చెల్లించాల్సి వస్తుందనేదది తెలుసుకుందాం..

ఐఫోన్ 14 ప్రీ బుకింగ్ విషయంలో యాపిల్ సంస్థ నుంచి అధికారికంగా ఏ విధమైన ప్రకటన విడుదల కాలేదు. కానీ ఐఫోన్ లాంచ్ ట్రెండ్స్ పరిశీలించినప్పుడు ప్రీ బుకింగ్ ఎప్పుడు ఉండవచ్చనేది అంచనా వేయవచ్చు. సాధారంగా లాంచ్ ఈవెంట్ జరిగిన మూడ్రోజుల తరువాత ప్రీ బుకింగ్ ప్రారంభమౌతుంటుంది. ఐఫోన్ 14 లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 7వ తేదీన ఉండవచ్చనే అంచనాలున్నాయి. ఈ క్రమంలో ప్రీ ఆర్డర్ బుకింగ్ అనేది సెప్టెంబర్ 10వ తేదీన ప్రారంభం కావచ్చు.

ఐఫోన్ 14 ప్రీ ఆర్డర్ బుకింగ్ కోసం ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకూ ఉండవచ్చు. ఐఫోన్ 14 బేసిక్ మోడల్ 699 డాలర్లతో ప్రారంభం కావచ్చు. అటు ఐఫోన్14 ప్రో 999 డాలర్లు ప్రారంభ ధర ఉండవచ్చని తెలుస్తోంది. ఇక ఐఫోన్ ప్రో మ్యాక్స్ 1199 డాలర్లు కాగా, ఐఫోన్ 14 మ్యాక్స్ 899 డాలర్లుగా ఉండవచ్చని అంచనా. 

Also read: UPI Payments Charges: యూపీఐ ఆన్‌లైన్ చెల్లింపులపై ఛార్జిలు పడనున్నాయా, కేంద్రం ఏం చెబుతోంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News