Difference Between Ibomma And Ibomma One: ప్రస్తుతం చాలామంది కొత్త సినిమాలను థియేటర్లలో కంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనే ఎక్కువగా చూస్తున్నారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వాటి సబ్క్రిప్షన్ ధరలను ఒక్కసారిగా పెంచాయి. దీనికి కారణంగా ప్రస్తుతం చాలామంది ధర్డ్ పార్టీకి సంబంధించిన మూవీ స్ట్రీమింగ్ వెబ్‌సైట్‌ను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వారైతే ఎక్కువగా ఐ బొమ్మ, మూవీ రూల్స్ వంటి ప్రమాదకరమైన వెబ్సైట్లో సినిమాలు చూస్తున్నారు. కొత్త సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కూడా ఐబొమ్మ స్ట్రీమింగ్ చేయడంతో.. చాలామంది దీనిలోనే ఎక్కువగా సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఐ బొమ్మకు సంబంధించిన చాలా వెబ్సైట్ గూగుల్‌లో కనిపిస్తున్నాయి. అలాగే ఆ వెబ్సైట్లో కొన్ని ఫేక్‌వి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి మొబైల్ ఫోన్లతో ఈ వెబ్సైట్లో సినిమాలు చూసేవారు తప్పకుండా పలు రకాలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతం ఐ బొమ్మకు సంబంధించిన రెండు వెబ్సైట్లు కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేస్తూ వస్తున్నాయి. అందులో మొదటి వెబ్సైట్ ఐ బొమ్మ అయితే.. రెండవది ఐ బొమ్మ వన్. ఈ రెండిటి మధ్య అనేక తేడాలు ఉన్నాయి. అయితే ఈ రెండు వెబ్సైట్లకు సంబంధించిన తేడాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం గూగుల్‌లో ఐబొమ్మ అని టైప్ చేయక వచ్చేదే Ibomma one వెబ్సైట్. ప్రస్తుతం చాలామంది దీనిని వినియోగించి కొత్త సినిమాలను చూస్తున్నారు. అలాగే మరికొంతమంది ఐ బొమ్మ వెబ్సైట్లో కూడా మూవీస్ చూస్తున్నారు. ఈ ఐ బొమ్మ వన్ వెబ్సైట్లో అనేక కొత్త ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ పాత మోడల్ ఐ బొమ్మలో కేవలం కొన్ని ఆప్షన్స్‌తో సినిమాలను స్ట్రీమింగ్ చేస్తోంది. ముఖ్యంగా మొదటి తేడా విషయానికొస్తే, ఈ ఐ బొమ్మ వన్ వెబ్సైట్లో సినిమాలను సులభంగా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్‌ను కూడా లభిస్తోంది. అలాగే ఇందులో సినిమాలు చూసేవారికి మధ్యలో ఎలాంటి అడ్వటైజ్మెంట్ రాకుండా నోటిఫికేషన్ కూడా ఆఫ్ చేసింది.
ఇక సాధారణ ఐ బొమ్మ విషయానికొస్తే.. ఇందులో సినిమాలు డౌన్లోడ్ చేసుకోవడం చాలా కష్టం. ఇందులో సినిమాలు డౌన్లోడ్ చేసుకోవడానికి ప్లే స్టోర్‌లో లభించే కొన్ని యాప్స్‌ను వినియోగించాల్సి ఉంటుంది. అలాగే ఈ వెబ్సైట్లో సినిమాలు చూసే వారికి 15 నిమిషాలకు ఒకసారి మూవీ మధ్యలో యాడ్ కూడా రన్ అవుతుంది. దీంతోపాటు అదనంగా కొన్ని ప్రత్యేకమైన యాడ్స్ కూడా రన్ అవుతాయి. దీనికి కారణంగా సినిమా చూసేవారికి అంతరాయం కలిగే అవకాశాలు ఉన్నాయి.
అలాగే ఐబొమ్మ వన్ వెబ్సైట్లో ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో స్ట్రీమింగ్ అవుతున్న కొత్త సినిమాలన్నీ అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా అదనంగా ఇతర డబ్బింగ్ సినిమాలు కూడా లభిస్తాయి. కానీ సాధారణ ఐ బొమ్మ వెబ్సైట్లో మాత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చిన కొన్ని గంటల తర్వాత, చాలా లేటుగా స్ట్రీమింగ్ చేస్తోంది. దీంతోపాటు ఐబొమ్మ వన్ వెబ్సైట్లో ప్రత్యేకమైన సెర్చింగ్ ఆప్షన్ కూడా కలిగి ఉంటుంది. దీని ద్వారా కొత్త సినిమాలను సెర్చ్ చేసుకొని మరి చూడవచ్చు. అయితే సాధారణ ఐబొమ్మాలో సెర్చ్ ఆప్షన్ ఉన్నప్పటికీ అప్పుడప్పుడు పని చేయదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి