Facebook: మీ యూజ్‌ను చేయని ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను సింపుల్‌గా ఇలా డిలీట్ చేయండి

How To Delete FB Account: మీరు యూజ్ చేయని ఫేస్‌బుక్ అకౌంట్‌ను డిలీట్ చేయాలని చూస్తున్నారా..? ఎలా తొలగించాలో తెలియక వదిలేశారా..? అయితే ఇక్కడ ఇచ్చిన ప్రాసెస్ ఫాలో అవ్వండి. సింపుల్‌గా ఫేస్‌బుక్‌ను పర్మినెంట్‌గా తొలగించండి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 5, 2024, 06:17 PM IST
Facebook: మీ యూజ్‌ను చేయని ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను సింపుల్‌గా ఇలా డిలీట్ చేయండి

How To Delete FB Account: ఫేస్‌బుక్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాటింగ్‌లు, ఫొటోలు, వీడియోలు, తమ అభిప్రాయాలను పంచుకునేందుకు ఫేస్‌బుక్‌ను ఉపయోగించుకుంటున్నారు. కొంతమంది యూజర్లు ఒకటి కంటే ఎక్కువ ఫేస్‌బుక్ అకౌంట్‌లను క్రియేట్‌ చేసుకుంటారు. అన్ని అకౌంట్‌లను ఉపయోగించలేకపోయినా.. ఉంటే ఏమవుతుందని వేర్వేరు పేర్లతో ఫేస్‌బుక్‌లో కాలక్షేపం చేస్తుంటారు. కొంతమంది అకౌంట్‌లను క్రియేట్ చేసి ఎలా డిలీట్ చేయాలో తెలియక అలానే వదిలేస్తుంటారు. వాటిని వదిలేస్తే ఆన్‌లైన్ కేటుగాళ్లు హ్యాక్ చేసి.. మీ పేరుతో డబ్బులు వసూలు చేసే ప్రమాదం ఉంది. అందుకే మీరు ఉపయోగించని ఫేస్‌బుక్ అకౌంట్‌లను డిలీట్ చేయడం మర్చిపోవద్దు.

Also Read: Portronics Power Bank: రూ.3 వేలలోపే పోర్ట్రోనిక్స్ నుంచి మరో పవర్‌ బ్యాంక్‌.. ల్యాప్‌ట్యాప్‌ బ్యాటరీ 10 నిమిషాల్లో ఫుల్‌!

ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఇలా తొలగించండి..

==> ముందుగా మీరు డిలీట్ చేయాలనుకుంటున్న Facebook అకౌంట్‌ను ఓపెన్ చేయండి.
==> పైన రైట్‌ సైడ్‌లో ఉన్న మీ ప్రొఫైల్ ఫొటోపై క్లిక్ చేయండి.
==> "సెట్టింగ్‌లు, గోప్యత" ఆప్షన్‌ను ఎంచుకోండి.
==> "సెట్టింగ్స్"పై క్లిక్ చేయండి.
==> "మీ Facebook ఇన్ఫర్మేషన్‌"పై క్లిక్ చేయండి.
==> "Inactive and Delete" ఆప్షన్‌పై క్లిక్ చేయండి 
==> "మీ అకౌంట్‌ను తొలగించు"పై క్లిక్ చేయండి.
==> మీ పాస్‌వర్డ్‌ను మళ్లీ ఎంటర్ చేయండి. 
==> "మీ ఖాతాను తొలగించు"ని ఆప్షన్‌పై మళ్లీ క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్ నుంచి మీ అకౌంట్‌ పూర్తిగా తొలగించేందుకు 30 రోజుల సమయం ఉంటుంది. ఈ వ్యవధిలో మీ మనసు మార్చుకుని మళ్లీ అకౌంట్ కంటిన్యూ చేయాలని భావిస్తే.. మళ్లీ బ్యాక్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే 30 రోజుల తర్వాత అకౌంట్ పూర్తిగా డిలీట్ అవుతుంది. అకౌంట్‌ను డిలీట్ చేసే ముందు మీ పోస్ట్‌లు, ఫోటోలు, వీడియోలు, ఇతర డేటా మొత్తాన్ని సేవ్ చేసుకోవచ్చు. 

మీ డేటాను ఇలా సేవ్ చేసుకోండి..

==> మీ Facebook అకౌంట్‌ను ఓపెన్ చేయండి.
==> పైన రైట్‌ సైడ్‌లో ఉన్న మీ ప్రొఫైల్ ఫొటోపై క్లిక్ చేయండి.
==> "సెట్టింగ్‌లు, గోప్యత" ఆప్షన్‌ను ఎంచుకోండి.
==> "సెట్టింగ్స్"లోకి వెళ్లండి.
==> "మీ Facebook సమాచారం"ను ఎంచుకోండి
==> "మీ Facebook డేటా కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి" అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి
==> "స్టార్ట్ మై ఆర్కైవ్"పై క్లిక్ చేయండి.

Also Read: Cobra Snake: ధైర్య సాహసాలతో మనుమరాలిని కాపాడిన నాన్నమ్మ నాగుపాముకు బలి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News