Flipkart Crazy offer: బాప్రే.. డెడ్ చీప్ గా రియల్‌మి 5g స్మార్ట్‌ఫోన్.. కేవలం రూ. 549 కే..

Flipkart Crazy offer: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో ఇంకా అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు కొనసాగుతున్నాయి. మొన్నటివరకూ ఫెస్టివల్ సేల్స్‌తో అదరగొట్టిన ఫ్లిప్‌కార్ట్‌లో ఇంకా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 22, 2022, 07:04 PM IST
  • రియల్‌మి సి 33 స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్
  • 13 వేల రూపాయల స్మార్ట్‌ఫోన్ కేవలం 549 రూపాయలకే తీసుకెళ్లే అవకాశం
  • ఎక్స్చేంజ్‌పై 9,500 రూపాయలు తగ్గింపు
Flipkart Crazy offer: బాప్రే.. డెడ్ చీప్ గా రియల్‌మి 5g స్మార్ట్‌ఫోన్.. కేవలం రూ. 549 కే..

Flipkart Crazy offer: ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు ప్రముఖ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ ఇస్తోంది. ఇందులో భాగంగానే రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌పై మీరు ఊహించని డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ అందుకంటే కేవలం 500 రూపాయలకే ఈ స్మార్ట్‌ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ నడుస్తోంది. ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 500 రూపాయలకే తీసుకెళ్లే అద్భుత అవకాశముంది. రియల్‌మి సి33 అనేది ఓ ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్. మార్కెట్‌లో క్లిక్ అయిన మోడల్ ఇది. ఎందుకంటే ఈ స్మార్ట్‌ఫోన్ ధర తక్కువ. అయితే ఫీచర్లు బాగుండటంతో మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఇదే స్మార్ట్‌ఫోన్ మరింత తక్కువకు..మీరు ఊహించలేని ధరకు విక్రయమౌతోంది. అందుకే కస్టమర్లు భారీగా ఈ స్మార్ట్‌ఫోన్ బుక్ చేసుకుంటున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం..

రియల్‌మి సి33 స్మార్ట్‌ఫోన్ అసలు ధర12,999 రూపాయలు. దీనిపై కంపెనీ 23 శాతం డిస్కౌంట్ ఇస్తుండటంతో..ఇప్పుడీ స్మార్ట్‌ఫోన్ 9,999 రూపాయలకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రతి ఒక్కరి బడ్జెట్‌కు సరిపోతుంది. 

ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ ప్రకారం

కంపెనీ అందిస్తున్న 23 శాతం డిస్కౌంట్ కాకుండా ఎక్స్చేంజ్ సౌకర్యం కూడా ఉంది. ఎక్స్చేంజ్ అనేది మీ పాత ఫోన్ మోడల్, కండీషన్ బట్టి ఉంటుంది. ఎక్స్చేంజ్‌పై మరో 9499 రూపాయలు డిస్కౌంట్ పొందవచ్చు. ఒకవేళ మీకు ఎక్స్చేంజ్ పూర్తిగా వర్తిస్తే ఈ స్మార్ట్‌ఫోన్ మీకు కేవలం 549 రూపాయలకే దక్కుతుంది. 

రియల్‌మి సి 33 ఫీచర్లు

రియల్‌మి స్మార్ట్‌ఫో‌న్‌లో 50 మెగాపిక్సెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమేరా ఉంది. ఇందులో నైట్ మోడ్ ఆప్షన్ కూడా ఉంది. ఇదికాకుండా..ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5 మెగాపిక్సెల్ సెల్ఫీకెమేరా ఉంది. ఇది ఏఐ బ్యూటీని సపోర్ట్ చేస్తుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ సెన్సార్ ఉంది. దీంతోపాటు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఫోన్ కావడంతో డిమాండ్ కూడా అదికంగానే ఉంది.

Also read: Amazon OnePlus TV: అమెజాన్‌లో వ‌న్‌ప్ల‌స్‌ వై సిరీస్ టీవీపై భారీ తగ్గింపు.. రూ. 15 వేలకే 32 ఇంచ్ టీవీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 

 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News