Flipkart Discount Offers: 39వేల రూపాయల ఒప్పో స్మార్ట్‌ఫోన్ కేవలం 12 వేలకే

Flipkart Discount Offers: ఒప్పో స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కలలో కూడా ఊహించని ధరకు లభిస్తోంది. ఇదొక ప్రీమియం వెర్షన్ స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ ఫీచర్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో..ధర కూడా ఇప్పుడు అంతే తక్కువ.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 7, 2022, 03:51 PM IST
Flipkart Discount Offers: 39వేల రూపాయల ఒప్పో స్మార్ట్‌ఫోన్ కేవలం 12 వేలకే

OPPO Reno8 5G అందరికీ నచ్చే స్మార్ట్‌ఫోన్. ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోనా్‌పై ఇప్పుడు భారీ డిస్కౌంట్ ఇస్తోంది. ఆ ఆఫర్ ప్రకారం ఇప్పుడు కేవలం సగం ధరకే మీ సొంతం చేసుకోవచ్చు.

OPPO Reno8 5G ప్రీమియం రేంజ్ స్మార్ట్‌‌ఫోన్. చూడగానే కొనాలన్పించే మోడల్ ఇది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ, కెమేరా మరే ఇతర ఫోన్‌తో పోల్చలేం. ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర 38,999 రూపాయలుంది. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో చాలా తక్కువకే లిస్ట్ అయింది. దీనిపై 23 డిస్కౌంట్ అనంతరం కేవలం 29,999 రూపాయలకు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఇంకా ఈ ధర మీకు ఎక్కువగా అన్పిస్తే..ఇంకా తక్కువలో లభించేందుకు మరో ప్రత్యామ్నాయం ఉంది. 

ఎక్స్చేంజ్ ఆఫర్ ప్రయోజనాలు

OPPO Reno8 5G ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో 29,999 రూపాయలకు లిస్ట్ అయింది. లిస్టెట్ ప్రైస్ కంటే 50 శాతం తక్కువకే ఈ ఫోన్ పొందవచ్చు. ఎలాగంటే ఎక్స్చేంజ్ ధర 17,500 రూపాయలు అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. మీకు ఎక్స్చేంజ్ ధర పూర్తిగా వర్తిస్తే..కస్టమర్లకు ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 12,499 రూపాయలకే లభించనుంది. ఈ ధర ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ ధరతో సమానం. ఇందులో అద్బుతమైన కెమేరా ఫీచర్లు ఉన్నాయి. ఏకంగా 50 మెగాపిక్సెల్ కెమేరా ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత. అంతేకాకుండా 8 జీబీ ర్యామ్, 129 జీబీ స్టోరేజ్‌తో వస్తోంది. మొన్నటివరకూ దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఆఫర్ సీజన్ చాలారోజులు కొనసాగింది. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ పూర్తయినా..కొన్ని ఎంంపిక చేసిన ఫోన్లపై ఇంకా ఆఫర్లు అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్.

Also read: IPO Updates: వచ్చే వారం నాలుగు ఐపీవోలు, 14వేల పెట్టుబడితో లాభాలు ఆర్జించే అవకాశం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News