Drop Poco C51 Price: ఫ్లిప్‌కార్ట్‌లో Poco C51 మొబైల్ బంఫర్‌ ఆఫర్‌..కేవలం రూ.4,999కే పొందండి..

Drop Poco C51 Price: ఫ్లిప్‌కార్ట్‌ కొన్ని స్మార్ట్‌ ఫోన్స్‌పై ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. గత సంవత్సరంలోని మార్కెట్‌లోకి విడుదలైన POCO C51 స్మార్ట్ ఫోన్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అందనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2024, 11:17 AM IST
Drop Poco C51 Price: ఫ్లిప్‌కార్ట్‌లో Poco C51 మొబైల్ బంఫర్‌ ఆఫర్‌..కేవలం రూ.4,999కే పొందండి..

Drop Poco C51 Price: అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారా? మీ కోసం ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేక డీల్స్‌ను తీసుకువచ్చింది. ఈ డీల్స్‌లో భాగంగా ప్రముఖ టెక్‌ కంపెనీలకు సంబంధించిన మొబైల్స్‌ భారీ తగ్గింపు లభిస్తున్నాయి. దీంతో పాటు కొన్ని స్మార్ట్ ఫోన్స్‌ ఫ్లిప్‌కార్ట్‌ బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ ప్రత్యేక డీల్‌లో భాగంగా పోకో ఇటీవలే మార్కెట్‌లోకి అతి తక్కువ ధరతో లాంచ్‌ చేసి POCO C51 మొబైల్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ MRP ధర రూ.9,999కాగా ప్రత్యేక డీల్‌లో భాగంగా 50 శాతం తగ్గింపుతో కేవలం రూ.4,999కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనపు తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్స్‌తో POCO C51 మొబైల్‌ పొందడానికి వన్‌కార్డ్‌ క్రెడిట్‌ కార్డ్‌ లేదా యస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌తో బిల్‌ చెల్లిస్తే తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఈ స్మార్ట్ ఫోన్‌ Airtel Prepaid ప్రత్యేక ఆఫర్‌తో వచ్చింది. ఈ మొబైల్‌ కొనుగోలు చేసేవారికి ఎయిర్‌టెల్‌ ప్రీపేయిడ్‌ ఆప్షన్‌పై అదనంగా రూ.750 వరకు తగ్గింపును అందిస్తోంది.  

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
ఈ POCO C51 స్మార్ట్ ఫోన్‌ 6.52 అంగుళాలు LCD డిస్ల్పే, 720 x 1600 పిక్సెల్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఈ  మొబైల్ ఆండ్రాయిడ్ 13 (గో ఎడిషన్), MIUIపై పని చేస్తుంది. అలాగే ఇది Mediatek Helio G36 (12 nm)చిప్‌సెట్‌తో మార్కెట్‌లోకి వచ్చింది. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన CPU విషయానికొస్తే ఆక్టా-కోర్‌తో రాబోతోంది. దీంతో పాటు అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. 

ఇతర ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
❃ 8MP ప్రధాన కెమెరా
❃ డ్యూయల్ LED ఫ్లాష్
❃ 5MP సెల్ఫీ కెమెరా
❃ 3.5 మిమీ జాక్ లౌడ్ స్పీకర్
❃ Li-Po 5000 mAh బ్యాటరీ  
❃ 10W వైర్డు ఛార్జింగ్
❃ డ్యూయల్ సిమ్ సెటప్‌

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News