E-Textile Technology: ప్రస్తుతం మనం ఊహించనిస్థాయిలో టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా మొబైల్ రంగంలో రోజురోజుకు కొత్త ఆవిష్కరణలు వస్తూనే ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ యుగంలో వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందిస్తూ నిత్యం కొత్త అప్‌డేట్స్ పరిచయం చేస్తున్నారు. మనం మొబైల్‌ను కేబుల్ ఉపయోగించి ఛార్జింగ్ చేస్తున్నాం. అయితే ప్రతిసారి ఛార్జర్‌ను క్యారీ చేయడం కష్టంగా మారుతోంది. అందుకే సరికొత్త ఈ-టెక్స్‌టైల్ అనే టెక్నాలజీ మార్కెట్‌లోకి వచ్చింది. మీరు వేసుకున్న దుస్తులే.. స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేస్తాయి.
ఈ టెక్స్‌టైల్ అనేది ఒక ప్రత్యేకమైన ఫాబ్రిక్. ఇది సాధారణ బట్టల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ దుస్తులు మీ స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేయగలవు. సౌర శక్తిని పవర్‌గా మార్చుకుని ఆదా చేసుకుంటాయి. మీకు కావలసినప్పుడు ఆ పవర్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. మనం ధరించే దుస్తులు ఎంత పెద్దవి అయితే అంత సౌరశక్తి అందులో నిల్వ ఉంటుంది. దీని ద్వారా మీ స్మార్ట్ ఫోన్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఛార్జ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ కేబుల్‌ను క్యారీ చేయాల్సిన అవసరం లేదు.
నాటింగ్‌హామ్ ట్రెంట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ ప్రత్యేకమైన వస్త్రాన్ని సిద్ధం చేశారు. ఇది ఇప్పటివరకు కలగా ఉండగా.. ఇప్పుడు శాస్త్రవేత్తలు నిజం చేసి చూపించారు. ఇందులో అమర్చిన ప్రత్యేక ఫాబ్రిక్ మీ గాడ్జెట్‌లను ఛార్జ్ చేయడానికి ఉపయోగించే సౌర శక్తిని దానంతట అదే నిల్వ చేస్తుంది. ఈ గాడ్జెట్స్‌లో స్మార్ట్‌ఫోన్‌లతో పాటు స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్‌లు ఉన్నాయి.
ఈ ప్రత్యేకమైన ఫాబ్రిక్ సౌర శక్తిని సేవ్ చేసుకునేందుకు శాస్త్రవేత్తలు 1,200 చిన్న కాంతివిపీడన కణాలను (సోలార్ ప్యానెల్స్) ఉపయోగించారు. సౌరశక్తి నిల్వ ఉంచడానికి సోలార్ ప్యానెల్స్ బాగా పనిచేస్తాయి. ఈ ఫాబ్రిక్ 400 మిల్లీవాట్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయగలదు. దీంతో మీరు మీ గాడ్జెట్‌లను సులభంగా ఛార్జ్ చేయగలరు. ప్రస్తుతం ఈ టెక్నాలజీపై ఇంకా వర్క్ జరుగుతోంది. కానీ భవిష్యత్తులో ఇది అందరికీ అందుబాటులోకి రానుంది.
Also Read: Pawan Kalyan: పవన్‌ను సీఎంగా ప్రకటిస్తే పొత్తుకు ఓకే! చంద్రబాబుకు బీజేపీ పెద్దల ఆఫర్?
Also Read: Chandra Grahan Time 2022: ఈ ఏడాదిలో చివరి చంద్రగ్రహణం.. ఈ సమయంలో ఇలాంటి పనులు చేస్తే అంతే సంగతి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి