YS Sharmila to KCR: 10 ఏళ్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ దొర అమలు చేసిన ఏ పథకం చుసినా.. "అర్హుల పొట్ట కొట్టు, బందిపోట్లకు పెట్టు" అన్నచందంగానే ఉంటోందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. పేదలకు దక్కాల్సిన అభివృద్ధి ఫలాలు, సంక్షేమ పథకాలు అన్నీ బీఆర్ఎస్ పార్టీ దొంగల పాలవుతున్నాయ్ అని మండిపడ్డారు.
కేసీఆర్ పుట్టింది రైతుల కోసం కాదు. రైతులను పాడే ఎక్కించడానికే అని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతును రాజును చేసినం అని ప్రగల్భాలు పలికే చిన్న దొరా.. రైతు ఎట్లా రాజయ్యిండో సమాధానం చెప్పాలే అని డిమాండ్ చేస్తూ మంత్రి కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.
YS Sharmila Unveiled YSR Statue: పాలేరు గడ్డ వైఎస్సార్ బిడ్డకు అడ్డా అని అన్నారు వైఎస్ షర్మిల. పాదయాత్రను మళ్లీ మొదలుపెడతానని.. 4 వేల కిలోమీటర్లను పాలేరులోనే పూర్తి చేస్తానని చెప్పారు. పాలేరులో వైఎస్సార్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు.
Ys Jagan-Ponguleti: ఓ వైపు తెలంగాణ ఎన్నికలు మరోవైపు ఏపీలో వేడెక్కుతున్న రాజకీయాలు. ఈ క్రమంలో ఇటీవల కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న ఆ నేత హఠాత్తుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు మీ కోసం.
YSRTP chief YS Sharmila About Corruption in Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరిగింది అని ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై తెలంగాణ మంత్రులు ఎదురుదాడికి దిగడాన్ని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా తప్పుపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో వచ్చిన కమీషన్లతో కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు.
YS Sharmila Slams KCR: అన్నివర్గాల ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన మీది ప్రజల పక్షం కాదు... ప్రజలను దోచుకు తినే దొంగల పక్షం.. ఇంకా చెప్పాలంటే జనాలను పట్టి పీడించే బీఆర్ఎస్ పార్టీది దొంగల పక్షమే అవుతుంది అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.
YSRTP Merging In Congress: రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ఇప్పటికే వైఎస్సార్టీపీ విలీనం దిశగా చర్చలు మొదలుపెట్టారని.. వైఎస్సార్టీపీ విలీనం ప్రతిపాదన ప్రస్తుతం చర్చల దశలో ఉందని రకరకాల ఊహాగానాలు తెరపైకొచ్చాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలనే ఈ విషయంపై స్వయంగా స్పందించారు.
Congress-YSRTP Alliance: కాంగ్రెస్‌లో వైఎస్ఆర్టీపీ విలీన వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరికకు దాదాపు ముహూర్తం ఖరారు అయిందని ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో చర్చలు మొదలయ్యాయని వార్తలు వస్తున్నాయి.
YS Sharmila strong counter to KCR and KTR: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అమర వీరులు చేసిన త్యాగాన్ని కల్వకుంట్ల వారి కుటుంబం తమ భోగంగా మల్చుకుంది అని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఒక పార్టీ కాదని.. అది బందిపోట్ల రాష్ట్ర సమితికి "దోపిడీ మిషన్ " అని ఎద్దేవా చేశారు.
YS Sharmila Slams BJP, BRS: బీఆర్ఎస్ పార్టీ, బీజేపి మధ్య రహస్య స్నేహం ఉందన్న వైఎస్ షర్మిల.. ఈ రెండు పార్టీల తీరు లోకం ముందు నువ్వు కొట్టినట్లు చేస్తే.. నేను ఏడ్చినట్లు చేస్తా.. అన్న చందంగా ఉంది అని ఎద్దేవా చేశారు. అంతటితో ఊరుకోని వైఎస్ షర్మిల.. ఇంతకీ మీరు నడిపే రహస్య దోస్తానం ప్రీ పోల్ ఒప్పందమా ? లేక పోస్ట్ పోల్ ఒప్పందమా ? అని సూటిగానే ప్రశ్నించారు.
YS Sharmila On CM KCR: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చి స్పీచ్‌పై కామెంట్స్ చేశారు వైఎస్ షర్మిల. ఆయన ప్రసంగం అంతా అబద్దాలమయం అని అన్నారు. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పల పాలుజేశారని ఫైర్ అయ్యారు.
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేశారు.
YS Sharmila Fires on CM KCR: రైతులకు ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తెలంగాణలో అకాల వర్షాలతో నష్టపోతే.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో వర్షాలతో 2 లక్షల 34 వేల ఎకారాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు.
YS Sharmila Fires on CM KCR: రైతులకు ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తెలంగాణలో అకాల వర్షాలతో నష్టపోతే.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో వర్షాలతో 2 లక్షల 34 వేల ఎకారాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు.
YS Sharmila : ఖమ్మం జిల్లాలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటిస్తారు. వైరా, ఇల్లందు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ నష్టపోయిన రైతులతో మాట్లాడనున్నారు. దెబ్బ తిన్న పంటకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
YSRTP Chief YS Sharmila released from Chanchalguda Jail. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు రూ.30 వేల పూచీకత్తుతో కూడిన రెండు షూరిటీలను షర్మిల కోర్టుకు సమర్పించారు.
YS Sharmila : వైయస్ షర్మిల మీద కేసు నమోదైంది. ఆమెను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైయస్ షర్మిల దురుసుగా ప్రవర్తించింది. పోలీసులు మీద చేయిజేసుకుంది.
YS Sharmila Slams CM KCR: మొన్నటి వరకు ఇదే నాలుకతో కదా లంకలో పుట్టినోళ్లంతా రావణ సంతతే అని దూషించావు. ఆంధ్రోళ్లు అంతా తెలంగాణ ద్రోహులేనని ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నావు.. మరి ఇప్పుడు దేశ రాజకీయాలంటూ ఆంధ్రాకు కూడా వెళ్తున్న నువ్వు తెలంగాణ సమాజానికి ఏం సమాధానం చెప్తావు అంటూ సీఎం కేసీఆర్‌ని వైఎస్ షర్మిళ నిలదీశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.