CoronaVirus At Ram Temple in Ayodhya | రామాలయ నిర్మాణంలో భాగంగా ఆగస్టు 5వ తేదీన భూమి పూజ చేసేందుకు అంతా సిద్ధం చేశారు. అయితే అయోధ్యలో కరోనా వైరస్ కలవరం రేపుతోంది. ఓ పూజారితో పాటు మరో 14 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు.
Funny Criminal Video: వికాస్ దుబే ( Vikas Dubey ) ఎన్కౌంటర్ తరువాత ఉత్తర్ ప్రదేశ్‌లో నేరస్థులు ( Criminals in Uttar Pradesh ) వణికిపోతున్నారు. నెక్ట్స్ తమ ఎన్కౌంటర్ జరుగుతుందో ఏమో అని భయపడుతున్నారు. ఇలా వారు ఆలోచించడానికి అనేక కారణాలు ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై దేశ వ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. వికాస్ దుబేకు సహకరించిన అధికారులు, నాయకులపై ఏం చర్యలు తీసుకుంటారంటూ ప్రతిపక్షాలన్నీ యూపీ బీజేపీ ప్రభుత్వాన్ని ( UP govt ) చుట్టుముడుతున్నాయి. 8న కాన్పూర్‌లో 8 మంది పోలీసులను దారుణంగా హత్య చేసిన వికాస్ దుబే మధ్యప్రదేశ్ ఉజ్జయిని ( Ujjain ) వరకు ఎలా చేరుకున్నాడని, ఎవరి ప్రమేయం లేకుండానే ఆయన అక్కడి వరకు చేరుకుని ఉంటాడా అంటూ బీజేపీని లక్ష్యంగా చేసుకుని ప్రశ్నలు గుప్పిస్తున్నాయి.
ఫ్యాక్టరీలో సంభవించిన భారీ పేలుడు కార్మికుల జీవితాలను బుగ్గిపాలు చేసింది. కార్మికుల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఒక్కసారిగా సంభవించిన పేలుడు (Ghaziabad Factory Explosion)లో ఏడుగురు కార్మికులు చనిపోగా, మరో నలుగురు కార్మికులకు కాలిన గాయాలయ్యాయి.
UP road accident ప్రతాప్‌ఘడ్ : ఉత్తర్ ప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రతాప్‌ఘడ్ జిల్లా వాజిద్‌పూర్‌లో ఓ కంటైనర్ ట్రక్కు మరో ఎస్యువి వాహనం ఎదురెదురుగా వచ్చి ఒకదానినొకటి బలంగా ఢీ కొన్న ఘటనలో 9 మంది చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు ( Truck collided with SUV ).
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఔరయ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది వలస కూలీలు చనిపోయారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కరోనావైరస్ నివారణ కోసం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పడిపోయిన ఆదాయాన్ని తిరిగి పుంజుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నాయి. అందులో భాగంగానే ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో పాటు మద్యంపై ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
'కరోనా వైరస్' పేరు వింటేనే ప్రపంచవ్యాప్తంగా జనం గజ గజా వణికిపోతున్నారు. 70 దేశాలను వణికిస్తున్న 'కరోనా వైరస్' తాజాగా భారత్ లోనూ అడుగు పెట్టింది. దీంతో ఢిల్లీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
ఎక్కాలు కూడా రాని మాస్టార్ల చేతిలో రేపటి పౌరుల 'భవిష్యత్'.. ఈ విషయం గురించి మాటల్లో చెప్పడం కంటే.. దృశ్యరూపంలో చూస్తేనే బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీడియోపై ఓ లుక్కేయండి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.