Guidelines To Gruha Jyothi Scheme: ఉచిత విద్యుత్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన వెలువరించింది. ఉచిత విద్యుత్ పొందాలనుకునే ప్రజలకు కొన్ని సూచనలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి చేస్తేనే ఈ పథకాన్ని పొందుతారని స్పష్టం చేసింది.
Ap New Pension Scheme: ఏపీ ప్రభుత్వం కొత్త సంవత్సరం కానుకలు ఇస్తోంది. పెన్షన్ పెంపుతో పాటు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇవాళ్టి నుంచి 3 వేల రూపాయలు పెన్షన్ అందనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YS Sharmila to KCR: 10 ఏళ్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ దొర అమలు చేసిన ఏ పథకం చుసినా.. "అర్హుల పొట్ట కొట్టు, బందిపోట్లకు పెట్టు" అన్నచందంగానే ఉంటోందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. పేదలకు దక్కాల్సిన అభివృద్ధి ఫలాలు, సంక్షేమ పథకాలు అన్నీ బీఆర్ఎస్ పార్టీ దొంగల పాలవుతున్నాయ్ అని మండిపడ్డారు.
AP Poll Strategy Survey: ఎన్నికలు సమీపించేకొద్దీ సర్వేల ప్రభావం పెరుగుతోంది. మొన్న టైమ్స్ నౌ భారత్ సర్వే తరువాత ఇప్పుడు మరో సంస్థ సర్వే సంచలనం రేపుతోంది. ఏపీలో ఈసారి అధికారం ఎవరిదో ఆ పార్టీ సంచలన సర్వే వెలువరించింది. పూర్తి వివరాలు మీ కోసం..
Kakinada MLA Sensational Comments: కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఓ కార్యక్రమంలో సెన్సేషనల్ కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తేనే ప్రభుత్వ సంక్షేమాలు అందుతాయని.. లేదంటే ఆపేస్తామని అన్నారు. ఈ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
Telangana Cabinet Meeting Decicions: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ అయి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా 15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది.
TRS MLC Kavitha On Freebies : హైదరాబాద్: ఉచితాలు అందించే పథకాలను ఇకనైనా ఆపేయాలని ఇటీవల కేంద్రం చేసిన ప్రకటనపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు.
Ys Jagan: ఏపీలో వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నిమిత్తం భారీగా నిధులు జమచేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల్ని అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో గత ప్రభుత్వానికి..ఇప్పటికీ ఉన్న తేడాను వివరించారు.
e Shram Portal: దేశవ్యాప్తంగా కార్మికులకు కేంద్రం శుభవార్త అందించింది. కార్మికుల సంక్షేమం కోసం కొత్త సేవల్ని అందుబాటులో తెచ్చింది. అసంఘటిత రంగం కోసం ప్రారంభించిన ఈ సదుపాయంతో మరింత సౌలభ్యం కలుగుతుంది.
Kapu Nestham: ఆంధ్రప్రదేశ్‌లో కాపునేస్తం రెండవ విడతకు రంగం సిద్ధమవుతోంది. అర్హులైన వ్యక్తులు స్థానికంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో సంప్రదిస్తే..ఖాతాలో 15 వేల రూపాయలు జమ అవుతాయి.
YSR Bima Scheme: ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా వైఎస్ఆర్ బీమా పథకంలో కీలకమైన మార్పులు చేశారు. ఈ మార్పులు జూలై 1 నుంచి అమల్లో రానున్నాయి.
Amma Vodi scheme: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన అమ్మఒడి పథకం రెండో విడత రేపు ప్రారంభమవడం ఖాయమైంది. ఎన్నికల కోడ్ నేపధ్యంలో ప్రశ్నార్ధకంగా మారిన పథకంపై క్లారిటీ వచ్చింది.
అనుకున్నదే అయింది. అధికార పార్టీ నేతలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడిందే నిజమైంది. ఎన్నికల కోడ్ సాకుగా చూపిస్తూ సంక్షేమ పథకాల్ని నిలిపివేయాలని ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
AP CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పారు. కరోనావైరస్ ( Coronavirus) విజృంభిస్తున్న కష్టకాలంలోనూ ప్రభుత్వ పథకాలు అమలు కావడంలో ఆలస్యం తలెత్తకుండా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ప్రవాసాంధ్రులకు సహాయ వారధిలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విదేశీ పర్యటనలో భాగంగా శనివారం ముఖ్యమంత్రి బృందం దుబాయ్ చేరుకున్నారు. సాయంత్రం ఏపీఎన్ఆర్టీ నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. "మీరు ఒంటరి వాళ్లు కాదు.. మీ వెంట రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నేను ఉంటాను. మీ కోసం మరెవరూ చేయని మంచి విధానాలను నేను చేస్తాను.."అని ప్రవాసాంధ్రులకు భరోసా ఇచ్చారు చంద్రబాబు. ఈ సమావేశంలోనే సీఎం మూడు ప్రత్యేక కార్యక్రమాలను ప్రకటించి, 40 కోట్ల రూపాయలను కేటాయించారు.
ఆధార్ కార్డుకు ఇంకా దరఖాస్తు చేయని వారికి కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో అవకాశం ఇచ్చింది. ఈ నెల 30వ తేదీ వరకు ఉన్న గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించారు. కేంద్ర సమాచార శాఖ దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీచేసింది.
కేంద్రంతో పాటు వివిధ రాష్ట్రాలలో అమలవుతున్న సంక్షేమ పథకాలు పొందాలంటే అందుకు ఆధార్ తప్పనిసరి చేశారు. రాయితీపై సిలిండర్, చౌక దుకాణాల్లో సరుకులు, ఎరువులు.. ఇలా ప్రభుత్వం అమలు చేసే ఏ పథకానికైనా ఆధార్ కార్డు తప్పనిసరైంది. దీంతో ఆధార్ కార్డు లేని వారి ఆందోళనను పరిగణనలోకి తీసుకొన్న మోడీ సర్కార్ ఈ మేరకు గడువు పొడగింపు నిర్ణయం తీసుకొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.