Mamata Banerjee Victory: నందిగ్రామ్‌లో ఉత్కంఠ రేపిన కౌంటింగ్, 12 వందల ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన మమతా బెనర్జీ

Mamata Banerjee Victory: పశ్చిమ బెంగాల్ నిజంగా ఉత్కంఠ రేపింది. దేశమంతా ఎదురుచూసిన రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు నిజంగానే ఆశ్చర్యం కల్గించాయి. మమతా హ్యాట్రిక్ విజయం ఓ వైపు, హోరాహోరీ పోరులో పోరాడి గెలవడం మరోవైపు ఆసక్తి కల్గించాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 2, 2021, 05:20 PM IST
Mamata Banerjee Victory: నందిగ్రామ్‌లో ఉత్కంఠ రేపిన కౌంటింగ్, 12 వందల ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన మమతా బెనర్జీ

Mamata Banerjee Victory: పశ్చిమ బెంగాల్ నిజంగా ఉత్కంఠ రేపింది. దేశమంతా ఎదురుచూసిన రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు నిజంగానే ఆశ్చర్యం కల్గించాయి. మమతా హ్యాట్రిక్ విజయం ఓ వైపు, హోరాహోరీ పోరులో పోరాడి గెలవడం మరోవైపు ఆసక్తి కల్గించాయి.

దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా అందరి దృష్టి మాత్రం పశ్చిమ బెంగాల్ ఎన్నికల( West Bengal Elections)పైనే నిలిచింది. కారణం బెంగాల్ పీఠంపై ఎలాగైనా కాషాయజెండా ఎగురవేయాలని భావించిన బీజేపీ(Bjp)ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. టీఎంసీ అగ్రనేతల్ని, మంత్రుల్ని ఆకర్షించి పార్టీలో చేర్చుకుంది. అందేకాకుండా మమతా బెనర్జీకు కుడిభుజంగా నిలిచిన కీలకనేత సువేందు అధికారి(Suvendu Adhikari)ని సైతం పార్టీలో ఆహ్వానించింది. ప్రధాని మోదీ ( Pm Narendra modi) సహా బీజేపీ అగ్రనేతలంతా ప్రచారపర్వం కొనసాగించారు.

అయినా సరే బెంగాల్ కుమార్తెకే ప్రజలు పట్టం కట్టారు. టీఎంసీ(TMC)కు మరోసారి అంటే మూడోసారి అధికారం అప్పగించారు. 214 స్థానాల్ని కైవసం చేసుకున్న టీఎంసీ ప్రభుత్వం (Tmc Government) ఏర్పాటు చేయబోతోంది. బీజేపీ కేవలం 75 సీట్లకే పరిమితమైంది. అయితే రాష్ట్రమంతా టీఎంసీ భారీ విజయం సాధించినా నందిగ్రామ్ (Nandigram) ఫలితం మాత్రం చివరి వరకూ హోరాహోరీగా నిలిచింది. సువేందు అధికారితో మమతా చివరి నిమిషం వరకూ పోరాడాల్సివచ్చింది. ఓ దశలో మమతా బెనర్డీ(Mamata Banerjee) ఓటమి ఖాయమనే పరిస్థితి కన్పించింది. మొదట్నించీ సువేందు అధికారి మెజార్టీ కనబరుస్తూనే వచ్చారు. ఓ దశలో అయితే ఏకంగా 8 వేల మెజార్టీతో ఇక విజయం ఖాయమనే ధీమాలో ఉన్న సువేందు అధికారి..చివరి రౌండ్ వచ్చేసరికి ఓటమి పాలయ్యారు. ఐదవ రౌండ్‌లో మాత్రమే మమతా బెనర్జీ సువేందు అధికారి ఆదిక్యాన్ని తగ్గించగలిగారు. 16 వ రౌండ్ ముగిసేసరికి 820 ఓట్ల స్వల్ప మెజార్టీలో ఉన్న మమతా బెనర్జీ..చివరి రౌండ్ ముగిశాక..12 వందల ఓట్ల మెజార్టీతో సువేందు అధికారిపై విజయం సాధించారు.

వాస్తవానికి మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం నందిగ్రామ్ కానేకాదు. నందిగ్రామ్‌లో సువేందు అధికారికి చాలా పట్టుంది. గత ఎన్నికల్లో టీఎంసీ తరపున పోటీ చేసి 81 వేల మెజార్టీతో గెలిచిన వ్యక్తి. అటువంటి వ్యక్తి బీజేపీ(Bjp)లో చేరి తనకు సవాల్ విసరడంతో మమతా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నందిగ్రామ్‌లో పోటీ చేశారు. గట్టి పోటీ అనంతరం చివరికి గెలిచారు.

Also read: West Bengal Assembly Elections Results live Update: బెంగాల్ పీఠంపై ముచ్చటగా మూడోసారి దీదీ ప్రభుత్వం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News