Rachna Banerjee as TMC MP Candidate: బెంగాల్ ఎంపీగా టీఎంసీ త‌రుపున బ‌రిలో దిగుతున్న బాల‌య్య హీరోయిన్..

Rachna Banerjee as TMC MP Candidate: 2024లో జ‌రిగే లోక్‌స‌భ ఎన్నిక‌ల కోసం దేశంలోని అన్ని పార్టీలు స‌మాయాత్తం అవుతున్నాయి. ఇప్ప‌టికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్దుల తొలిజాబితాను ప్ర‌క‌టించాయి. తాజాగా ప‌శ్చిమ బంగ‌లోని అధికార‌ టీఎంసీ అధినేత్రి రాష్ట్రంలోని 42 మంది అభ్య‌ర్ధుల జాబితాను ప్ర‌క‌టించి సంచ‌ల‌నం రేపారు. ఇందులో బాల‌య్య‌, చిరంజీవిల‌తో న‌టించిన ర‌చ‌న బెన‌ర్జీ ఉండ‌టం విశేషం.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 11, 2024, 10:19 AM IST
Rachna Banerjee as TMC MP Candidate: బెంగాల్ ఎంపీగా టీఎంసీ త‌రుపున బ‌రిలో దిగుతున్న బాల‌య్య హీరోయిన్..

Rachna Banerjee as TMC MP Candidate: వ‌చ్చే సార్వత్రిక ఎన్నిక‌ల కోసం అధికార బీజేపీ త‌రుపున ఎన్టీయే ఒక‌వైపు కాంగ్రెస్ సార‌థ్యంలోని ఇండి కూట‌మి మ‌రోవైపు స‌మ‌రాస్త్రాలు సంధించుకుంటున్నాయి. ఇక ఇండి కూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న టీఎంసీ అధినేత్రి.. కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ.. రాష్ట్రంలో ఉన్న 42 మంది అభ్య‌ర్ధుల లిస్టును విడుద‌ల చేసింది. అంతేకాదు కోల్‌క‌తా వేదిక‌గా ఎన్నిక‌ల స‌మ‌ర శంఖం పూరించింది. ఈ సారి ప‌లువురు సిట్టింగ్ ఎంపీల‌కు టికెట్ నిరాక‌రిస్తూ కొత్త‌వారిని బ‌రిలో దింపింది. అందులో ప్ర‌ముఖ క్రికెట‌ర్ యూసుఫ్ ప‌ఠాన్.. బ‌హ‌రామ్ పూర్ నుంచి ఎంపీగా బ‌రిలో దిగ‌నున్నారు. మ‌రోవైపు ప్ర‌ముఖ న‌టి ర‌చ‌నా బెన‌ర్జీ.. హుగ్లీ నుంచి లోక్‌స‌భ‌కు పోటీ చేయ‌నున్నారు. ఈమె ప‌లు తెలుగు చ ఇత్రాల్లో హీరోయిన్‌గా న‌టించింది. ఇవివి స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన నేను ప్రేమిస్తున్నాను సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

ఆ త‌ర్వాత పిల్ల న‌చ్చింది. బాల‌కృష్ణ హీరోగా న‌టించిన సుల్తాన్‌తో పాటు చిరంజీవి బావ‌గారూ బాగున్నారా.. తో పాటు క‌న్యాదానం, రాయుడు వంటి చిత్రాల్లో క‌థానాయిక‌గా నటించింది. చివ‌ర‌గా తెలుగులో వైవియ‌స్ చౌద‌రి ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది.  

తెలుగు సినిమాల‌కు గుడ్ బై చెప్పినా.. బెంగాలీ చిత్ర సీమ‌లో నెంబ‌ర్ వ‌న్ క‌థానాయిక‌గా స‌త్తా చాటింది. అటు ఒడియా, హిందీ, త‌మిళం స‌హా ప‌లు భాష‌ల్లో న‌టించింది. 1994లో ఈమె ఫెమినా మిస్ ఇండియా ఎంపికైంది. అదే యేడాది మిస్ కోల్‌క‌తాగా అందాల కిరీటం కైవసం చేసుకుంది. గ‌త కొన్నేళ్లుగా ఈమె టీఎంపీ పార్టీ త‌రుపున ప‌నిచేస్తున్నారు. తాజాగా జ‌ర‌గ‌బోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఈమెను హుబ్లీ నుంచి
బ‌రిలో దింపింది టీఎంసీ అధినేత్రి. మ‌రి ఈమె ఎంపీగా గెలిచి పార్ల‌మెంటులో అడుగుపెడుతుందా లేదా అనేది చూడాలి. గ‌తంలో టీఎంసీ త‌రుపున మిమి చ‌క్ర‌బ‌ర్తి, నుస్ర‌త్ జ‌హాన్ వంటి హీరోయిన్స్ కూడా లోక్‌స‌భకు ఎన్నికైన సంగ‌తి తెలిసిందే క‌దా.

Also Read: AP Politics: వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం.. ప్రతిపక్షాలకు షాక్‌.. జగన్‌కు బూస్ట్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News