Theatres Close 10 Days In Telangana: సినీ పరిశ్రమలో కలకలం రేగింది. సినిమాలు విడుదల కాకపోవడంతో థియేటర్ల యాజమాన్యాలు సినీ పరిశ్రమకు ఝలక్ ఇచ్చాయి. 10 రోజుల పాటు థియేటర్లు బంద్ చేస్తున్నట్లు తెలంగాణ సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమాన్యాలు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువ ఉండటంతో శుక్రవారం నుంచి పది రోజుల పాటు షోలు వేయవద్దని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు, ఇతర కారణాలతో ఇటీవల పెద్ద సినిమాలు విడుదల కాకపోవడంతో సినిమా హాళ్లకు ప్రేక్షకుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలో బంద్కు నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్,తెలంగాణ సినిమా థియేటర్ల మూత బడ్డాయి. డిజిటల్ ప్రొవైడర్స్ ఛార్జీలకు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ర్టాల సినిమా నిర్మాతల మండలి జాయింట్ యాక్షన్ కమిటీ ఈ రోజు నుంచి ( మార్చి 2న) బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే .ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో సహా తమిళనాడు, కేరళ, కర్ణాటకలో థియేటర్ యాజమాన్యాలు చిత్ర ప్రదర్శన నిలిపివేశారు.
ఈ రోజు (మార్చి 2) నుంచి తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో చిత్ర ప్రదర్శన నిలిచిపోనుంది. డిజిటల్ ప్రొవైడర్స్ ఛార్జీలకు వ్యతిరేకంగా బంద్ పిలుపు నేపథ్యంలో థియేటర్లు మూతబడనున్నాయి. ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలతో సహా తమిళనాడు, కేరళ, కర్ణాటకలో సినిమాల ప్రదర్శన నిలిపివేయనున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు రూ. 2 వేల 500 థియేటర్లు ఉన్నాయి. బంద్ ప్రభావంతో థియేటర్లు మూతపడే అవకాశాలు ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.