రామగుండం నియోజవర్గానికి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఈ రోజు సంచలన ప్రకటన చేశారు. టీఆర్ఎస్ హైకమాండ్ తీరుపై అసంతృప్తితోనే తాను ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
గన్ మెన్ల ఉపసంహరణ అంశంపై హైకోర్టు తీర్పు నాగం జనార్థన్ రెడ్డికి అనకూలంగా వచ్చింది. తనకు గన్ మెన్లను తొలగించిన అంశంపై హైకోర్టులో నాగం పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. తనపై కక్ష సాధింపు చర్యలో భాగంగా ప్రభుత్వం కావాలనే తన భద్రతను ఉపసంహరించుకుందని పిటిషన్ లో పేర్కొన్నారు.
నాగం పిటిషన్ పై గురువారం విచారణ జరిపిన ధర్మాసనం నాగం తరఫు న్యాయవాది వాదనలను సమర్ధించింది. అంతే కాదు నాగంకు భద్రతను ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
గత కొంత కాలం నుంచి టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరుబాట పట్టిన కోందండరాం రాజకీయాల్లో అడుపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన సొంతంగా పార్టీ పెడతారని కొందరు అంటుంటే.. ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ పార్టీ పెట్టినా..పెట్టిక పోయినా ఆయన పోటీ చేయడం ఖాయమని రాజకీయవర్గాల నుంచి సమాచారం. దీంతో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం కూడా ఇప్పుడు చర్చనీయంగా మారింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం కిషన్ రెడ్డి పాలమూరు యూనివర్శిటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో నాలుగేళ్లుగా ఒక్క టీచర్ను కూడా విశ్వవిద్యాలయాలలో నియమించలేదని ఆరోపించారు. టిఆర్ఎస్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా లేరని కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు. 2019లో టిఆర్ఎస్ ఓటమి ఖాయమని బీజేపీ నేత కిషన్ రెడ్డి వ్యాఖ్యనించారు. టీఆర్ఎస్ తన నీడను తానే చూసి భయపడే స్థితికి చేరిందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను కొత్త పార్టీ పెట్టాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తుందని.. అయితే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. సహచరుల అభిప్రాయాలు తీసుకున్న అనంతరం దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న కోదండరాం ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ నెల 30న 'కొలువులకై కొట్లాట' సభ
తెలంగాణ టీడీపీలో మరో నేత గట్టి షాక్ ఇచ్చారు. మొన్నా, నిన్నటివరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని చెబుతూ వచ్చిన మాజీ ఎమ్మెల్యే సీతక్క ఈ ఉదయం (మంగళవారం ఉదయం) తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను జాతీయాధ్యకుడు చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ ద్వారా పంపారు. ఆతరువాత హుటాహుటిన దిల్లీకి వెళ్లిపోయారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.