ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే 8 కోట్లకు పైగా ప్రజలు ఈ మహమ్మారి బారిన పడగా.. 17.6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజల నుంచి ప్రముఖల వరకు అందరూ కరోనావైరస్ ( Coronavirus ) ప్రభావానికి గురవుతున్నారు. తాజాగా తనను కలిసిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) డైరక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనమ్ ఘెబ్రేయేసస్ ( Tedros Adhanom ) సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు.
కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) డైరక్టర్ ట్రెడోస్ ఆద్నామ్ ఘాబ్రియోసిస్ ( Tedros Adhanom ) నో సిల్వర్ బులెట్ ( Silver Bullet ) అనే మాట వినిపించింది. కరోనావైరస్ కు సిల్వర్ బులెట్ వ్యాక్సిన్ వచ్చే ( No Silver Bullet For Covid-19 ) అవకాశం లేదు అని అన్నారు టెడ్రోస్. చాలా మందికి ఈ పదం ఏంటో అర్థం కాలేదు. దాంతో గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకి పెరుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) ఆందోళన వ్యక్తం చేసింది. పెరుగుతున్న కేసులతో మునుపటిలా పరిస్థితులు సర్వసాధారణం అయ్యే అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది.
కరోనావైరస్ ( coronavirus) మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఇంకా నియంత్రణలోకి రాలేదని.. ఇది మరింత ఉగ్రరూపం దాల్చుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా COVID-19 కేసుల సంఖ్య గత ఆరు వారాల్లోనే రెట్టింపు అయ్యిందని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తంచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.