Covid-19: ఇదే చివరి మహమ్మారి కాదు: WHO

ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే 8 కోట్లకు పైగా ప్రజలు ఈ మహమ్మారి బారిన పడగా.. 17.6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ ఘెబ్రేయేసస్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Dec 27, 2020, 11:59 AM IST
Covid-19: ఇదే చివరి మహమ్మారి కాదు: WHO

Coronavirus crisis will not be the last pandemic: WHO | న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే 8 కోట్లకు పైగా ప్రజలు ఈ మహమ్మారి బారిన పడగా.. 17.6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ ఘెబ్రేయేసస్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్సే చివరి మహమ్మారి కాదని.. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ఉపద్రవాల్ని కూడా ఎదుర్కోవాల్సి రావొచ్చని టెడ్రోస్‌ అధనామ్‌ పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, పశు సంరక్షణను సరిగా నిర్వహించలేకపోతే మానవ ఆరోగ్య మెరుగు కోసం చేపడుతున్న చర్యలు వృథానే తప్ప ఎలాంటి ఉపయోగం లేదని ఆయన వివరించారు. 

ఇలాంటి (coronavirus) విపత్తులు తలెత్తినప్పుడు దీర్ఘకాల ప్రణాళికలు చేపట్టకుండా ప్రభుత్వాలు డబ్బులు ఖర్చు పెట్టి చేతులు దులుపుకొంటున్నాయని.. ఇది ప్రమాదకరమైన ధోరణి అని టెడ్రోస్ (Tedros Adhanom Ghebreyesus) పేర్కొన్నారు. ఆదివారం తొలిసారి జరగనున్న అంటువ్యాధుల సన్నద్ధత అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మీడియాతో మాట్లాడారు. కోవిడ్‌ మహమ్మారి నుంచి యావత్తు ప్రపంచం అనేక పాఠాలు నేర్చుకోవాల్సి ఉందని టెడ్రోస్‌ సూచించారు. Also Read: New coronavirus strain: ఫ్రాన్స్‌కు విస్తరించిన కొత్త కరోనా వైరస్..లాక్‌డౌన్ ఆంక్షలు

కోవిడ్ (COVID-19) లాంటి అంటువ్యాధుల తలెత్తినప్పుడు భయాందోళనకు గురికావడం.. నివారణకు డబ్బులు ఖర్చుపెట్టడం.. తర్వాత నిర్లక్ష్యం చేయడం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. అంటువ్యాధుల విషయంలో దూరదృష్టి లోపిస్తే తీవ్రమైన ప్రమాదాలు తప్పవని హెచ్చరించారు. కరోనా మహమ్మారి వల్ల ఒక్క ఏడాదిలోనే యావత్తు ప్రపంచం తలకిందులైందని టెడ్రోస్‌ తెలిపారు. దీనివల్ల సామాజిక, ఆర్థిక రంగాలు కూడా తవ్రంగా పతనమయ్యాయని.. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు అప్రమత్తం కావాలని సూచించారు. Also Read: Kazakhstan: సెక్స్ బొమ్మను వివాహమాడిన బాడీబిల్డర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News