Tablighi Jamaat chief Maulana Saad: న్యూ ఢిల్లీ: తబ్లిగి జమాత్ అధ్యక్షుడు మౌలానా సాద్‌తో ఢిల్లీ అల్లర్ల కేసు ( Delhi riots case) నిందితుడు తాహిర్ హుస్సేన్‌కి ( Tahir Hussain ) ఉన్న లింకును బయటపెట్టేందుకు దర్యాప్తు సంస్థలు తమ వంతు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే ఆదాయ పన్ను శాఖతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా మౌలానా సాద్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్న సంగతి తెలిసిందే.
ఢిల్లీలో అల్లర్లు, ఐబి ఆఫీసర్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తాహిర్ హుస్సేన్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ అల్లర్లలో హింసకు పాల్పడిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత తాహిర్ హుస్సేన్ని అరెస్ట్ చేసిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. అతడిని ఆరు గంటలపాటు విచారించారు. యాంటిసిపేటరీ బెయిల్ కోసం రూస్ ఎవెన్యూ కోర్టు వద్దకు వచ్చిన తాహిర్ హుస్సేన్ని చాకచక్యంగా అరెస్ట్ చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం... అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది. ఇంతకీ తాహిర్ హుస్సేన్ నుంచి పోలీసులు రాబట్టాలనుకుంటున్న సమాచారం ఏంటి ? తాహిర్ నుంచి పోలీసులు
ఢిల్లీ అల్లర్లలో మృతుల సంఖ్యకు ఓ లెక్క ఉందేమో కానీ... ఆ అల్లర్లు మిగిల్చిన విషాదానికి గురైన బాధితుల సంఖ్యకు లెక్కలేదు. ఢిల్లీ అల్లర్లలో మృతుల సంఖ్య 42 కి చేరినప్పటికీ.. వారిపై ఆధారపడిన కుటుంబాలు ఎన్ని రోడ్డున పడ్డాయో చెప్పడం ఎవరితరం కాదు.. కొడుకును పోగొట్టుకుని రోదిస్తున్న తల్లిని ఎవరు ఓదార్చగలరు ? జీవితాంతం తోడుంటాడనుకున్న భర్త అర్థాంతరంగా దూరమైతే ఆ మహిళ పడే మానసిక వేధనకు అంతుందా ? తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లలకు ఇక దిక్కెవరు ? ఇలాంటి సందేహాలే ఇదిగో ఈ కుటుంబాన్నీ వేధిస్తున్నాయి. ఢిల్లీ అల్లర్లు మిగిల్చిన ఈ విషాదానికి అంతుందా ?
ఢిల్లీ అల్లర్లు, హింసకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు, కోల్‌కతాలో సీఏఏకు మద్దతుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ర్యాలీ, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ కార్పొరేటర్ ఇజ్రత్ జహాన్ అరెస్ట్, సీబీఎస్ఇ పరీక్షల అప్డేట్స్, యూపీలో పడవ ప్రమాదానికి సంబంధించిన తాజా అంశాల సమాహారమే ఈ 2020 న్యూస్ వీడియో
ఢిల్లీ అల్లర్లలో హింసకు బలై ఓ తల్లి కొడుకుని పోగొట్టుకుంది.. కోటి ఆశలతో కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ నవ వధువు కాళ్లపారాణి కూడా ఆరకముందే... పెళ్లయి పది రోజులు కూడా అవకముందే భర్తను పోగొట్టుకుంది.. మరో కోటుంబం తండ్రిని కోల్పోయి రోడ్డున పడింది.. మరొక కుటుంబం తల్లిని కోల్పోయింది. ఈస్ట్ ఢిల్లీలో ఎక్కడ చూసినా ఏవో ఒక కన్నీటిగాథలే కనిపిస్తున్నాయి. కన్నీళ్లను దిగమింగుకుంటూ మార్చురీల బయట శవం కోసం వేచిచూస్తోన్న తల్లులు, తండ్రులు, సోదరులు, అక్కాచెల్లెళ్లే కనిపిస్తున్నారు. వాళ్ల బాధలను ప్రత్యక్షంగా చూసిన ఢిల్లీ వాసులు ఏమంటున్నారని జీ మీడియా తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఢిల్లీ హింసపై వాళ్ల అభిప్రాయం ఏంటో మీరే
ఢిల్లీ అల్లర్లలో హింసకు పాల్పడిన ముఠాకు మాస్టర్ మైండ్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నేత తాహిర్ హుస్సేన్ ఎవరు ? 20 ఏళ్ల క్రితం ఉపాధి కోసం పొట్టచేతపట్టుకుని ఢిల్లీకి వచ్చిన తాహీర్ హుస్సేన్ ఉన్నట్టుండి కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు ? 8వ తరగతి వరకే చదువుకుని ఒకప్పుడు కూలీ పని చేసుకున్న తాహీర్ హుస్సేన్ ఢిల్లీలోని కోటీశ్వరుల్లో ఒకడిగా ఎలా ఎదిగాడు ? ఫర్నిచర్ తయారు చేసే తాహీర్ హుస్సేన్‌పై జీహాద్ హెడ్‌క్వార్టర్స్‌ని రూపొందిస్తున్నాడనే ఆరోపణలు ఎందుకొచ్చాయి ? ఈ ఆరోపణలకు ఆధారాలున్నాయా ? తాహీర్ హుస్సేన్ చరిత్ర ఏం చెబుతుందో తెలుసుకోవాలంటే ఇదిగో ఈ వీడియో స్టోరీ చూడాల్సిందే.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఢిల్లీ హింస వెనుక ఎవరి హస్తం ఉంది ? ఆప్ నేత మద్దతుతోనే అల్లరిమూకలు హింసకు పాల్పడ్డాయా ? రాళ్లు రువ్వుతూ విధ్వంసానికి పాల్పడిన అల్లరి మూకలకు ఆప్ నేత తాహిర్ హుస్సేన్ ఆశ్రయం ఇచ్చారా ? తాహిర్ హుస్సేన్ ఇంటిపైకప్పుపై పెట్రోల్ బాంబులు, రాళ్లు, ఇటుక పెళ్లలు, సీసాలు ఎందుకున్నాయి ? ఢిల్లీ అల్లర్లలో ఎంత మంది చనిపోయారు ? ఢిల్లీ హింసలో అసాంఘీక శక్తులు ప్రవేశించాయా ? అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.