Tablighi Jamaat: తబ్లిగి జమాత్ నేతకు, ఢిల్లీ అల్లర్ల కేసు నిందితులకు లింక్స్

Tablighi Jamaat chief Maulana Saad: న్యూ ఢిల్లీ: తబ్లిగి జమాత్ అధ్యక్షుడు మౌలానా సాద్‌తో ఢిల్లీ అల్లర్ల కేసు ( Delhi riots case) నిందితుడు తాహిర్ హుస్సేన్‌కి ( Tahir Hussain ) ఉన్న లింకును బయటపెట్టేందుకు దర్యాప్తు సంస్థలు తమ వంతు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే ఆదాయ పన్ను శాఖతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా మౌలానా సాద్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్న సంగతి తెలిసిందే.

Last Updated : Jun 29, 2020, 07:22 PM IST
Tablighi Jamaat: తబ్లిగి జమాత్ నేతకు, ఢిల్లీ అల్లర్ల కేసు నిందితులకు లింక్స్

Tablighi Jamaat chief Maulana Saad: న్యూ ఢిల్లీ: తబ్లిగి జమాత్ అధ్యక్షుడు మౌలానా సాద్‌తో ఢిల్లీ అల్లర్ల కేసు ( Delhi riots case) నిందితుడు తాహిర్ హుస్సేన్‌కి ( Tahir Hussain ) ఉన్న లింకును బయటపెట్టేందుకు దర్యాప్తు సంస్థలు తమ వంతు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే ఆదాయ పన్ను శాఖతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా మౌలానా సాద్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్న సంగతి తెలిసిందే. ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 2005, ఫారెనర్స్ యాక్టు ఉల్లంఘించినందుకు పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న మౌలానా సాద్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సైతం దర్యాప్తు వేగవంతం చేసింది. ( Also read : Tablighi Jamaat Markaz: తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్‌పై హత్య కేసు ) 

ఈడి విచారణలో మౌలానా సాద్‌కి వ్యతిరేకంగా చాలా సాక్ష్యాధారాలే చిక్కినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఢిల్లీలో అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఆప్ నేత తాహిర్ హుస్సేన్, ఫైజల్ ఫారూఖిలతో ( Faizal Farooqui ) మౌలానా సాద్‌కి సంబంధాలు ఉన్నట్టు ఈడి తమ విచారణలో సాక్ష్యాధారాలు సేకరించింది. తాహిర్ హూస్సేన్ ఆమ్ ఆద్మీ పార్టీలో ఉంటూ ఢిల్లీ అల్లర్ల అనంతరం పార్టీ నుంచి సస్పెండ్ కాగా ఢిల్లీలోని రాజధాని స్కూల్స్‌కి ఫారూఖి యజమానిగా ఉన్నాడు. ( Also read: మహారాష్ట్రలో జూలై 31 వరకూ లాక్ డౌన్ )

తాహిర్ హుస్సేన్‌తో పాటు అతడితో సంబంధాలు కలిగి ఉన్న సన్నిహితులు, మిత్రుల నివాసాల్లోనూ గత కొన్ని నెలలుగా పలు దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో దర్యాప్తు సంస్థలకు పలు కీలకమైన డాక్యుమెంట్స్ లభించాయి. అవన్నీ పరిశీలిస్తే.. మౌలానా సాద్, తాహిర్ హుస్సేన్, ఫారూఖి గత కొన్నేళ్లుగా ఎన్నో ఆస్తులు కూడబెట్టినట్టు తేలింది. ఢిల్లీ అల్లర్ల కేసు మాస్టర్ మైండ్ అయిన ఫైజల్ ఫారుఖికి చెందిన రాజధాని స్కూల్ బిల్డింగ్ కోసం మౌలానా సాద్ పెట్టుబడులు పెట్టినట్టు ఈడి గుర్తించింది. ఫారుఖికి చెందిన మరో స్కూల్‌లోనూ మౌలానా సాద్ తన నల్ల ధనాన్ని ( Black money ) పెట్టుబడిగా పెట్టినట్టు అధికారులు గుర్తించారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here.. 

Trending News