Neet UG 2024 Leak: నీట్ పేపర్ లీక్ ఘటనలో బీహర్ కు చెందిన నితీష్ కుమార్ ప్రధాన సూత్రధారి అంటూ వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మంది చార్జీషీట్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
Supreme Court: భారత అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. భార్య భర్తలు, అబార్షన్ విషయంలో న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అరుదైన తీర్పు ఇచ్చింది.
Navjot Singh Sidhu One Year Imprisonment: 1988లో రోడ్డుపై జరిగిన ఓ గొడవలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తి హత్యకు కారణమైనందుకు పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూకి సుప్రీం కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.
Supreme Court: నేర రహిత రాజకీయాలకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం కీలకమైన తీర్పు వెల్లడించింది. సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజకీయ నేతల గుండెల్లో గుబులు పట్టుకుంది.
అయోధ్యలో ఉగ్రదాడులకు పాల్పడేందుకు పాకిస్తాన్కి చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ కుట్రపన్నుతున్నట్టు భారత నిఘావర్గాలు పసిగట్టాయి. జీ హిందుస్తాన్కి అందిన సమాచారం ప్రకారం.. జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా మసూద్ అజార్ భారత్లో ఉన్న తమ ఉగ్రవాదులకు టెలిగ్రామ్ చాటింగ్ యాప్లో పంపించిన సందేశాన్ని దానిని భారత నిఘావర్గాలు గుర్తించినట్టు తెలుస్తోంది.
నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష అమలు చేస్తారని యావత్ దేశమంతా ఎదురు చూస్తోంది. మొన్నటికి మొన్న డిసెంబర్ 16నే దోషులను ఉరి తీస్తారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఐతే దోషుల్లో అక్షయ్ సింగ్ రివ్యూ పిటిషన్ వేయడంతో దీనికి కొద్దిరోజులు బ్రేక్ పడినట్లయింది.
అయోధ్య రామ మందిర నిర్మాణంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు నెలల్లోనే రామ మందిర నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. ఝార్ఖండ్లో సోమవారం జరిగిన చివరి దశ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏడేళ్లుగా పోరాడుతున్నాం... మరో ఏడు రోజులు ఆగలేమా ? ఆగుతాం... డిసెంబర్ 18న నిర్భయ కేసు దోషులకు డెత్ వారెంట్ ఇష్యూ అవుతుందని భావిస్తున్నానని నిర్భయ తల్లి ఆశాభావం వ్యక్తం చేశారు.
నిర్భయ కేసు విచారణ మళ్లీ వాయిదాపడింది. పటియాలా హౌస్ కోర్టులో నేడు కేసు విచారణ జరగాల్సి ఉంది. ఐతే అడిషనల్ సెషన్ జడ్జ్ సతీష్ కుమార్ అరోరా ఈ కేసు విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేశారు. నిర్భయ కేసులో దోషులుగా తేలిన వారికి ఉరి శిక్ష అమలు చేయాలని కోరుతూ ఆమె తల్లిదండ్రులు పటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బాబ్రీ మసీదు అంశంపై ఎంఐఎం పార్టీ శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చివేసిన వారందరినీ జైలుకు పంపించాలని అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్(Devendra Fadnavis resigns) తన సీఎం పదవికి రాజీనామా చేశారు. తమ ప్రభుత్వానికి సరైన మద్దతు లేనందున తాము రాజీనామా చేస్తున్నట్టు ఫడ్నవిస్ ప్రకటించారు.
మహారాష్ట్ర అసెంబ్లీ(Maharashtra assembly)లో రేపే బల పరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో అసలు ఈ వివాదాన్ని సుప్రీం కోర్టు వరకు తీసుకెళ్లిన పిటిషనర్లలో ఒకరైన ఎన్సీపీ(NCP) స్పందించింది.
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం(Maharashtra crisis) నెలకొన్న నేపథ్యంలో నవంబర్ 27న బుధవారం నాడు అసెంబ్లీలో బల పరీక్ష చేపట్టాల్సిందిగా సుప్రీం కోర్టు(Supreme Court orders) ఆదేశించింది.
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కోల్పోయిన శివ సేన.. ఇకపై కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దని భావిస్తోంది. అందుకోసం ఓవైపు సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేస్తూనే.. మరోపైవు తన ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది.
నవంబర్ 23 శనివారం ఉదయం బీజేపి నేత దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
మహారాష్ట్ర రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తీరును వ్యతిరేకిస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.