Indian Railways cancelled trains: ఇండియన్ రైల్వే మరోసారి ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. రెగ్యులర్ రైళ్లు, మెయిల్, ఎక్స్ప్రెస్, సబ్ అర్బన్ రైళ్లను రద్దు ( Trains cancelled ) చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే కొన్ని రైళ్లకు మాత్రం దీన్నించి మినహాయింపునిచ్చింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా సంక్రమణ ( coronavirus spread ) నేపథ్యంలో భారతీయ రైల్వే మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది.
Cancelled tickets money: ఇండియన్ రైల్వే మార్చి 21 నుంచి 31 మధ్య రద్దు చేసిన ప్రయాణికుల అన్ని టికెట్స్కి నగదును తిరిగి సదరు రైలు ప్రయాణికులకు చెల్లించింది. ఆన్లైన్లో ఐఆర్సిటిసి ఎకౌంట్ ( IRCTC account ) ద్వారా టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లందరికీ రద్దు చేసిన టికెట్స్ మొత్తానికి అయిన నగదును వారి వారి ఖాతాల్లో జమ చేసింది.
రైలు సేవల పునరుద్ధరణతో ఇండియన్ రైల్వే ( Indian Railways ) మే 11 నుంచి టికెట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇండియన్ రైల్వే ఐఆర్సిటిసి ( IRCTC ) ద్వారా సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి టికెట్ బుకింగ్ చేపడుతోందనే విషయం తెలియడంతో దేశం నలుమూలలా కొన్ని కోట్ల మంది ప్రయాణికులు రైలు టికెట్స్ కోసం పోటీపడ్డారు.
లాక్ డౌన్ ( Lockdown ) మే 17వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ( PM Modi`s video conference ) ద్వారా సమావేశమై ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రాల్లో నెలకొన్ని పరిస్థితులు, చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ కొనసాగింపుపైనా ( Lockdown extension ) ప్రధాని మోదీ ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.