54 వేల మంది ప్రయాణికులు రూ.10 కోట్ల విలువైన టికెట్స్ కొనుగోలు

రైలు సేవల పునరుద్ధరణతో ఇండియన్ రైల్వే ( Indian Railways ) మే 11 నుంచి టికెట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇండియన్ రైల్వే ఐఆర్‌సిటిసి ( IRCTC ) ద్వారా సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి టికెట్ బుకింగ్ చేపడుతోందనే విషయం తెలియడంతో దేశం నలుమూలలా కొన్ని కోట్ల మంది ప్రయాణికులు రైలు టికెట్స్ కోసం పోటీపడ్డారు.

Last Updated : May 12, 2020, 04:22 PM IST
54 వేల మంది ప్రయాణికులు రూ.10 కోట్ల విలువైన టికెట్స్ కొనుగోలు

న్యూ ఢిల్లీ: రైలు సేవల పునరుద్ధరణతో ఇండియన్ రైల్వే ( Indian Railways ) మే 11 నుంచి టికెట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇండియన్ రైల్వే ఐఆర్‌సిటిసి ( IRCTC ) ద్వారా సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి టికెట్ బుకింగ్ చేపడుతోందనే విషయం తెలియడంతో దేశం నలుమూలలా కొన్ని కోట్ల మంది ప్రయాణికులు రైలు టికెట్స్ కోసం పోటీపడ్డారు. దీంతో రైలు టికెట్ బుకింగ్ ( Train ticket booking ) ప్రారంభించిన కొన్ని గంటల వ్యవధిలోనే 54 వేల మందికిపైగా ప్రయాణికులు టికెట్స్ బుక్ చేసుకున్నారు. ప్రయాణికులు అందరూ కొనుగోలు చేసిన టికెట్స్ విలువ రూ.10 కోట్లుగా ఇండియన్ రైల్వే ప్రకటించింది. రైలు ప్రయాణికులు టికెట్ బుకింగ్ కోసం ఎంతలా వేచిచూస్తున్నారనేదానికి ఇది ఒక నిదర్శనంగా నిలిచింది.  Also read : Flights and trains : మే 31 వరకు రైళ్లు, విమానాలు మాకొద్దని ప్రధానికి సీఎం విజ్ఞప్తి )

హౌరా-న్యూ ఢిల్లీ మధ్య ప్రయాణించే ఎక్స్ ప్రెస్ రైలులో అన్ని ఏసీ బోగీల టికెట్స్ మొదటి 10 నిమిషాల్లోనే పూర్తి టికెట్స్ అమ్ముడుపోయాయి. న్యూ ఢిల్లీ నుంచి ముంబై, బెంగళూరు, చెన్నై, కొచ్చి, కలకత్తా, భువనేశ్వర్, పాట్నా, రాంచి, అహ్మదాబాద్, సూరత్, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తదితర నగరాలకు 15 ప్రత్యేక రైళ్లు సేవలు అందించనున్నాయి. ఈ క్రమంలోనే దేశం నలుమూలల ఉన్న ప్రధాన నగరాలు, పట్టణాలను సైతం అనుసంధానం చేస్తూ ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు కొనసాగించనున్నాయి.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News